కొద్దిరోజుల కింద కుక్క కరిచింది.. వానలో తడిచాడు.. రేబిస్ లక్షణాలతో బాలుడు మృతి

కొద్దిరోజుల కింద కుక్క కరిచింది.. వానలో తడిచాడు.. రేబిస్ లక్షణాలతో బాలుడు మృతి

జగిత్యాల టౌన్, వెలుగు: రేబిస్ లక్షణాలతో బాలుడు చికిత్స పొందుతూ మృతిచెందిన ఘటన జగిత్యాల జిల్లాలో జరిగింది.  బీర్పూర్ మండలం తుంగూరు గ్రామానికి చెందిన రక్షిత్ (03) ను కొద్దిరోజుల కింద కుక్క కరిచింది. దీన్ని  తల్లిదండ్రులు గుర్తించలేదు. శుక్రవారం బాలుడు వానలో తడిచాడు. దీంతో బాలుడు అస్వస్థతకు గురవగా  జగిత్యాల ఆస్పత్రికి తీసుకెళ్లారు. బాలుడి కండీషన్ సీరియస్ గా ఉండడంతో సిద్దిపేటలోని ప్రైవేట్ ఆస్పత్రికి తీసుకెళ్లగా చికిత్స పొందుతూ శనివారం చనిపోయాడు.