టిప్పర్ కింద పడ్డ బాలుడు ..రెండు ముక్కలైన శరీరం

టిప్పర్ కింద పడ్డ బాలుడు ..రెండు ముక్కలైన శరీరం

పెద్దపల్లి జిల్లా  కాల్వశ్రీరాంపూర్ మండలం పెగడపల్లిలో దారుణం జరిగింది.  బాలుడి పైకి  టిప్పర్ లారీ దూసుకెళ్లింది. దీంతో బాలుడు అక్కడికక్కడే మృతి చెందాడు. బాలుడి శరీరం రెండు ముక్కలైంది. మృతి చెందిన బాలుడు చాలిగంటి సిద్దార్థ(7)గా గుర్తించారు. టిప్రర్ డ్రైవర్ పరారయ్యాడు. నష్టపరిహారం రూ. 10 లక్షలు చెల్లించాలంటూ బంధువుల ఆందోళనకు దిగారు. గ్రామస్తులు అంతా కూడా ఏకమై రోడ్డు మీద బైటాయించారు. ఘటనా స్థలానికి వచ్చిన పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు.