చైనా ప్రొడక్ట్‌‌లను బాయ్‌‌కాట్‌‌ చేయండి

చైనా ప్రొడక్ట్‌‌లను బాయ్‌‌కాట్‌‌ చేయండి

క్యాంపెయిన్‌‌ స్టార్ట్‌‌ చేసిన సెయిట్​

న్యూఢిల్లీ: చైనీస్‌‌ ప్రొడక్ట్‌‌లను బాయ్‌‌కాట్‌‌ చేయాలని కాన్ఫెడరేషన్‌‌ ఆఫ్‌‌ ఆల్ ఇండియా ట్రేడర్స్‌‌(సెయిట్‌‌) బుధవారం ఓ క్యాంపెయిన్‌‌ను ప్రారంభించింది. డిసెంబర్‌‌‌‌ 2021 నాటికి చైనీస్‌‌ ప్రొడక్ట్‌‌ల దిగుమతులను1300 కోట్ల డాలర్లకు తగ్గించడమే లక్ష్యంగా ఈ క్యాంపెయిన్‌‌ స్టార్ట్‌‌ చేశామని సెయిట్‌‌ పేర్కొంది. ప్రస్తుతం ఈ దిగుమతుల విలువ 7,000 కోట్ల డాలర్లుగా ఉంది.  ఇండియాలో తయారయ్యే ప్రొడక్ట్‌‌లతో  రిప్లేస్‌‌ అయ్యే  3,000 చైనీస్‌‌ ప్రొడక్ట్‌‌లను ఈ సంస్థ గుర్తించింది. ప్రస్తుతం ఇండియా–చైనా బోర్డర్‌‌‌‌ఇష్యూ మళ్లీ తెరమీదకొచ్చిన విషయం తెలిసిందే. ఇలాంటి పరిస్థితుల్లో ఈ క్యాంపెయిన్ ప్రారంభమవ్వడం ప్రాధాన్యం సంతరించుకుంది.

ఈ క్యాంపెయిన్‌‌ను ‘ఇండియన్‌‌ గూడ్స్‌‌–అవర్‌‌‌‌ ప్రైడ్‌‌’ పేరుతో సెయిట్‌‌ తీసుకొచ్చింది. చైనా నుంచి రా మెటీరియల్స్‌‌,టెక్నాలజీ ప్రొడక్టులు,  స్పేర్‌‌‌‌ పార్ట్స్‌‌, అక్కడే తయారైన వస్తువులు(ఫినిష్డ్​ గూడ్స్‌‌)ను ఇండియా దిగుమతి చేసుకుంటోందని సెయిట్‌‌ సెక్రటరీ జనరల్‌‌ ప్రవీణ్‌‌ ఖండెల్‌‌వాల్‌‌ అన్నారు. మొదట చైనాలో తయారై ఇండియాకు(ఫినిష్డ్​ గూడ్స్‌‌) వస్తున్న ప్రొడక్ట్‌‌లను బాయ్‌‌కాట్‌‌ చేయాలని సెయిట్‌‌ నిర్ణయించుకుందని పేర్కొన్నారు.  దేశంలోని ఏడు కోట్ల ట్రేడర్లను, 40,000 ట్రేడ్‌‌ అసోసియేషన్లను  రిప్రెజెంట్‌‌ చేస్తున్నామని ఈ సంస్థ తెలిపింది.

మరిన్ని వార్తల కోసం

బతుకు భరోసా లేని జర్నలిస్టులు

ఒక్కొక్కరికీ 12 గంటల డ్యూటీ!