ప్రేమించిన యువకున్ని పోలీసులకు పట్టించిన యువతి

ప్రేమించిన యువకున్ని పోలీసులకు పట్టించిన యువతి

సోషల్ మీడియాలో పరిచయం అయిన అమ్మాయిని బెదిరించి లొంగదీసుకోవాలనుకున్న ఓ యువకున్ని అరెస్ట్ చేశారు పోలీసులు. పాట్నాకు చెందిన యువతికి సోషల్ మీడియాలో ఓ యువకుడు పరిచయం అయ్యాడు. తరచూ వీరిద్దరూ ఫోన్ లో చాటింగ్ చేసుకునేవారు. ఆ పరిచయం కాస్తా ప్రేమగా మారింది. దీంతో వీరిద్దరు పెళ్లి చేసుకుందామనుకున్నారు. అయితే.. ఆ అమ్మాయి పర్సనల్ వీడియోలను పంపాల్సిందిగా కోరాడు ఆ యువకుడు. అతన్ని నమ్మిన యువతి తన పర్సనల్ వీడియోలను పంపించింది. అతను ఆ వీడియోలను సేవ్ చేసుకున్నాడు.

తాను పాట్నాకు వస్తున్నానని అక్కడ ఇద్దరం శారీరకంగా దగ్గర అవుదామని యువతిని కోరాడు ఆ యువకుడు. ఇందుకు ఆ యువతి అంగీకరించలేకపోవడంతో… వీడియోలను సోషల్ మీడియాలో అప్లోడ్ చేస్తానని బెదిరించాడు. దీంతో పాట్నా పోలీసులను ఆశ్రయించగా… ప్లాన్ ప్రకారం సదరు యువకున్ని ఆ యువతి పాట్నాకు రప్పించగా.. పోలీసులు పట్టుకుని అరెస్ట్ చేశారు.