బ్రహ్మాస్త్రం.. అస్త్రాల శక్తులివే

బ్రహ్మాస్త్రం.. అస్త్రాల శక్తులివే

బ్రహ్మాస్త్రం సినిమాకు సంబంధించి టాలీవుడ్ దర్శకుడు రాజమౌళి ఆసక్తికర విషయాలు వెల్లడించారు. ఈ మూవీ గురించి చెప్పిన ఆయన ఓ వీడియోను ట్వీట్ చేశారు. ‘అయాన్ ముఖర్జీ‘ గురించి కొత్తగా చెప్పాల్సిన అవసరం లేదు. ఆయన తీసిన సినిమాలు బ్లాక్ బస్టర్ అయ్యాయి. 2016లో తనను కలిసి ‘బ్రహ్మాస్త్రం’ కథ చెప్పారు. హిందూ పురాణాలను ఆధారంగా రాసుకున్న కథ. పురాణాలు, ఇతి హాసాల్లో ఉన్న శక్తులన్నింటినీ కలిసి అస్త్రావర్స్ క్రియేట్ చేశాడు. శాస్త్రాల ప్రకారం.. మనిషి మనుగడకు మూలకారణం పంచభూతాలు. పంచభూతాన్ని శాసించే శక్తి ‘బ్రహ్మ’కు ఉంటుంది. బ్రహ్మ శక్తి నుంచి పుట్టిన శాస్త్రాల గురించి.. అస్త్రాలను ఉపయోగించి సూపర్ హీరోల గురించి ఉంటుంది. వానరాస్త్రకు కింగ్ కాంగ్ కు ఉన్నంత బలం ఉంటుంది. ఈ అస్త్రాన్ని ధరించిన వారు కింగ్ కాంగ్ ఎంత దూరం ఎగురుతుందో అంత దూరం ఎగురగలుగుతాడు. అలాగే నంది అస్త్ర మరొకటి. ఒక వెయి ఒంగోలు గిత్తలను ఉండే శక్తి ఒకే మనిషిలో ఉందనుకోండి. ఎలా ఉంటుందో ఆ నంది అస్త్రాన్ని ధరించిన వ్యక్తికి అంత బలం వస్తుంది’ అని తెలిపారు.

‘అగ్ని అస్త్ర... ఒక ఫైర్ పవర్. మంటల్లో జ్వాలల్లో ఉండే పవర్.. ఆ మంటలను తనకు అనుగుణంగా మలుచుకో కలిగే శక్తి ఉంది. ఇలాంటివి ఇంకా ఎన్నో అస్త్రాలున్నాయి. ఇన్ని అస్త్రాలు వాటిని ఉపయోగించే సూపర్ హీరోస్.. వాళ్ల మధ్య జరిగే కాన్సఫ్లిక్ట్.. వీటిన్నింటిని ఉపయోగించి విజువల్ ఎఫెక్ట్ చేశారు. ఒక ఫెంటాస్టిక్ విజువల్ వండర్ క్రియేట్ చేశారు అయాన్. వీటన్నింటి కన్నా.. మరో శక్తి ఉంది.     అదే ప్రేమ. ఇద్దరి మధ్యనున్న ప్రేమ.. ఎలాంటి శక్తిని ఎదుర్కొంటుందో.. చూపెట్టారు. ఈ ఇండియన్ మూవీకి ప్రపంచ వ్యాప్తంగా డిస్నీ సంస్థ.. రిలీజ్ చేస్తోంది. సెప్టెంబర్ 09 బ్రహ్మాస్త్రం. డోంట్ మిస్ ఇట్’ అంటూ వీడియోలో రాజమౌళి వెల్లడించారు. బాలీవుడ్ స్టార్ హీరో రణ్ బీర్ కపూర్ హీరోగా, అలియా భట్ హీరోయిన్ గా నటించారు. తెలుగులో ‘బ్రహ్మాస్త్రం’ పేరిట రిలీజ్ కానుంది. అయాన్ ముఖర్జీ దర్శకత్వం వహిస్తున్నారు. బాలీవుడ్ సూపర్ స్టార్ అమితాబ్ బచ్చన్, టాలీవుడ్ కింగ్ నాగార్జున, మౌని రాయ్, డింపుల్ కపాడియాలు కీలక పాత్రల్లో నటించారు. దర్శక ధీరుడు రాజమౌళి తెలుగులో సమర్పకుడిగా వ్యవహరిస్తున్నారు.