కేతకీ బ్రహ్మోత్సవాలు షురూ

కేతకీ బ్రహ్మోత్సవాలు షురూ
  •     ఉత్సవ కమిటీ లేకుండానే ఉత్సవాలు ప్రారంభం
  •     ఆలయ సొంత నిధులతోనే ఏర్పాట్లు

ఝరాసంగం, వెలుగు: సంగారెడ్డి జిల్లా ఝరాసంగం మండల కేంద్రంలో వెలసిన శ్రీ కేతకీ సంగమేశ్వర స్వామి బ్రహ్మోత్సవాలు మంగళవారం శిఖరపూజతో ప్రారంభమయ్యాయి. ఈ వేడుకలు మార్చి 13వరకు కొనసాగుతాయి. ఆలయ అధికారులు, అర్చకులు, భక్తులతో కలిసి నాగుల పుట్టలో పాలు పోసి పుట్టమట్టితో శిఖర పూజ చేశారు. అనంతరం విఘ్నేశ్వర పూజతో మొదలై స్వామివారికి రుద్రాభిషేకం,అమ్మవారికి కుంకుమార్చన, ధ్వజారోహణం చేసి ఉత్స వాలు ప్రారంభించారు. 

ఉత్సవ కమిటీ ఏర్పాటు చేయకపోయినా ప్రభుత్వం ప్రత్యేకంగా ​ఫండ్స్ ​రిలీజ్​ చేయక పోయినా హుండీ ద్వారా వచ్చే ఆదాయంతో అధికారులు ఏర్పాట్లు చేశారు. మహాశివరాత్రి సందర్భంగా ఆలయానికి తెలుగు రాష్ట్రాలతో పాటు కర్నాటక, మహారాష్ట్రల నుంచి భక్తులు అధిక సంఖ్యలో వస్తారు. స్నానాల కోసం షవర్లు, మొబైల్​టాయిలెట్లు, తాగునీటి కోసం వాటర్​ట్యాంకర్లు, మున్సిపల్ శాఖ అధ్వర్యంలో పారిశుధ్యం నిర్వహణ, వైద్య ఆరోగ్య శాఖ అధ్వర్యంలో అంబులెన్స్​తో పాటు వైద్యశిబిరం ఏర్పాటు చేశారు. పోలీసులు​బందోబస్తు ఏర్పాట్లు చేయగా జహీరాబాద్​ఆర్టీసీ డీపో నుంచి 15 నిమిషాలకు ఒక బస్సు చొప్పున నడిపేందుకు చర్యలు చేపట్టారు.