టూమచ్ రా రే : గడ్డకట్టే మంచులో ప్రీ వెడ్డింగ్ షూట్ అంట

టూమచ్ రా రే : గడ్డకట్టే మంచులో ప్రీ వెడ్డింగ్ షూట్ అంట

కంప్యూటర్​ యుగంలో వివాహ బంధంలోకి అడుగుపెట్టే జంటలకు ఇప్పుడు ప్రీ వెడ్డింగ్‌ షూట్‌ తప్పనిసరిగా మారింది. అందమైన ప్రదేశాలు, ఎత్తైన కొండలు, జలపాతాలు ఇలా తమకు అందుబాటులో ఉన్న ప్రాంతాలకు వెళ్లి షూటింగ్ చేస్తారు. ఈ క్రమంలో పలువురు సాహసాలు చేసి ప్రాణాల మీదకు తెచ్చుకుంటున్నారు. తాజాగా, ఓ యువతి సైతం అటువంటి సాహసం చేసి.. చావు అంచులదాకా వెళ్లి త్రుటిలో బయటపడింది. గడ్డకట్టే చలిలో మైనస్‌ డిగ్రీల ఉష్ణోగ్రత ఉన్న ప్రాంతానికి వెళ్లిన ఓ ఇన్‌ప్లూయెన్సర్‌ తీవ్ర అనారోగ్యానికి గురయ్యారు. ఈ విషయాన్ని ఆమె స్వయంగా సోషల్ మీడియాలో పంచుకున్నారు.

మంచులో ప్రీ వెడ్ షూట్‌ జరుపుకోవాలనేది సోషల్ మీడియా ఇన్‌ఫ్లూయెన్సర్ ఆర్య వోరా అనే యువతి కల. ఇటీవల ఆమెకు పెళ్లి నిశ్చయం కావడంతో గత వారం కాబోయే భర్తతో కలిసి హిమాచల్‌ ప్రదేశ్‌లో మంచు కురిసే ప్రాంతానికి వెళ్లింది. అక్కడ ఉష్ణోగ్రత మైనస్ 22 డిగ్రీలు ఉండగా.. ఇద్దరూ చేయిచేయి కలిపి నడుస్తున్నట్లు వీడియో తీసుకోవాలని ప్లాన్‌ చేశారు. వారు అనుకున్నట్లుగానే షూటింగ్ జరిగింది. కానీ చలిని తట్టుకునే దుస్తులు ధరించకపోవడంతో షూట్‌ తర్వాత ఒక్కసారిగా ఆర్య వోరా అస్వస్థతకు గురయ్యారు. హఠాత్తుగా శరీరం చల్లబడిపోవడం మొదలైంది (హైపోథెర్మియా) అని ఆర్య తెలిపారు.

.ఈ వీడియోపై ఆర్యకు కాబోయే భర్త రాన్ కామెంట్ చేస్తూ.. ‘ఆ ప్రదేశం అత్యంత చల్లగా ఉంది.. ఆ వాతావరణం వల్ల షూట్‌ అయిపోగానే ఆర్య తీవ్రంగా ఇబ్బందిపడింది. అటువంటి ప్రదేశాల్లో వెచ్చగా ఉండే దుస్తులు ధరించకపోతే శరీరంలో ఉష్ణోగ్రతలు పడిపోతాయి.. కానీ, ఆర్య ఈ జ్ఞాపకం ఎప్పటికీ గుర్తుండిపోవాలని షూట్‌కు ముందుకొచ్చింది.. ఇతరులతో మా అనుభవాన్ని పంచుకోవాలని దీన్ని షేర్‌ చేస్తున్నాం’ అని ఇన్‌స్టాలో పోస్టు చేశారు.కాగా, ఈ వీడియో చూసిన నెటిజన్లు భిన్నాభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు. కొందరు ఆమె మద్దతుగా నిలిస్తే.. మరికొందరు ఆమె చర్యను తప్పుబడుతూ కామెంట్లు స్తున్నారు. ‘ఇన్‌స్టాగ్రామ్‌లో కంటెంట్ కోసం ప్రాణాలు పణంగా పెట్టాలా?’, ‘ఇది పిచ్చి పని’, ‘ రెండు నిమిషాల స్లో మోషన్‌ వీడియో కోసం ఇలాంటి పనులు చేస్తారా?’ అని ప్రశ్నిస్తున్నారు

‘మీరు దీన్ని చేయడానికి ధైర్యం చేస్తారా? నేను దాదాపు చావుకు దగ్గరగా వెళ్లాను.. షూటింగ్ తర్వాత హైపోథెర్మియాకు గురయ్యాను.. నాపై ఎవరో యాసిడ్‌ పోస్తున్నట్లు అనిపించింది.. ఆ బాధను భరించలేకపోయాను.. కానీ, అదృష్టవశాత్తూ తనకు కాబోయే భర్త రాన్‌, నా స్నేహితులు ఆ పరిస్థితి నుంచి బయపడేందుకు సహకరించారు’’ అని పేర్కొన్నారు. అందుకు సంబంధించిన వీడియోను ఆమె షేర్ చేశారు. చలితో వణికిపోతున్న ఆమెకు వెచ్చదనాన్ని ఇవ్వడానికి బ్లాంకెట్‌లు కప్పి, స్నేహితులు చుట్టూ చేరడం వీడియోలో కనిపిస్తోంది

ఆరోగ్యం కంటే చిత్రాలకు ప్రాధాన్యత ఇచ్చినందుకు సోషల్ మీడియా యూజర్​ లు  ఆమెపై విరుచుకుపడ్డారు. “ఫొటోలు ఎంత ఇంపార్టెంట్​ గా మారాయో చూస్తే చాలా హాస్యాస్పదంగా ఉందని ఒకరు కామెంట్​ చేశారు.  ఎవరైనా షూట్ కోసం .. జీవితాన్ని వ్యాపారం చేసుకోవడానికి సిద్ధంగా ఉన్నారని మరొకరు  పోస్ట్​ చేశారు.  ఈ వీడియోకు ఇప్పటి వరకు ( వార్త రాసే సమయానికి)  18 మిలియన్ల కంటే ఎక్కువ వీక్షణలు.., అయితే 4 లక్షల 90 వేల  లైక్‌ లు వచ్చాయి.