కడుపులో కోట్లు విలువ చేసే కొకైన్​

కడుపులో కోట్లు విలువ చేసే కొకైన్​

ఢిల్లీ అంతర్జాతీయ ఎయిర్‌పోర్టులో 11.28 కోట్ల విలువైన కొకైన్‌‌ను కస్టమ్స్ అధికారులు కస్టమ్స్ అధికారులు సీజ్ చేశారు. బ్రెజిల్ కు చెందిన ఒక వ్యక్తి 753 గ్రాముల కొకైన్‌‌ను తన కడుపులో దాచుకొని కస్టమ్స్ అధికారుల కళ్లు గప్పి ఎయిర్‌పోర్టు బయటకు తీసుకెళ్లే ప్రయత్నం చేశాడు. 

పసిగట్టిన కస్టమ్స్ అధికారులు అతడిని పట్టుకుని విచారించి, కడుపులో ఉన్న కొకైన్ ను బయటకు తీయించారు. అతడిపై ఎన్‌డీపీఎస్ యాక్ట్ కింద కేసు నమోదు చేసి, విచారణ చేస్తున్నట్లు కస్టమ్స్ అధికారులు తెలిపారు.