మూసీ బ్యూటిఫికేషన్​పై ముందడుగు .. నదికి ఇరువైపులా ఇండ్ల పర్మిషన్లకు బ్రేక్

మూసీ బ్యూటిఫికేషన్​పై ముందడుగు ..  నదికి ఇరువైపులా ఇండ్ల పర్మిషన్లకు బ్రేక్

హైదరాబాద్, వెలుగు:  మూసీ నది డెవలప్​మెంట్, బ్యూటిఫికేషన్​పై రాష్ట్ర ప్రభుత్వం ఫోకస్​పెట్టింది. ఉన్నతాధికారులతో నిర్వహిస్తున్న సమావేశాల్లో హైదరాబాద్ ప్రస్తావన వచ్చిన ప్రతిసారి సీఎం రేవంత్ రెడ్డి ముందుగా మూసీ బ్యూటిఫికేషన్ పైనే మాట్లాడుతున్నారు. పనులను వేగవంతం చేయాలని ఇప్పటికే అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. దీంతో మూసీ రివర్ ఫ్రంట్ డెవలప్ మెంట్ కార్పొరేషన్ లిమిటెడ్(ఎంఆర్డీసీఎల్) కూడా సంబంధిత ప్రక్రియను స్పీడప్ చేసింది. మూసీ నది పరివాహక ప్రాంతాల్లో కొత్తగా ఇండ్ల నిర్మాణాలు చేపట్టకుండా చర్యలు తీసుకోవాలని జీహెచ్ఎంసీకి లెటర్​రాసింది. స్పందించిన కమిషనర్​రోనాల్డ్ రాస్ మూసీకి ఇరువైపులా 50 మీటర్ల లోపు ఇండ్ల నిర్మాణానికి పర్మిషన్లు రద్దు చేస్తూ ఉత్తర్వులు ఇచ్చారు. ఎవరైనా అక్రమంగా నిర్మాణాలు చేపడితే, వెంటనే గుర్తించి కూల్చివేయాలని చెప్పారు.

నాలుగు నెలల్లో మాస్టర్ ప్లాన్ డ్రాఫ్ట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌  

మూసీ రివర్ ను పబ్లిక్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌, ప్రైవేట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ భాగస్వామ్యంతో అభివృద్ధి చేసేందుకు అధికారులు ప్లాన్ రూపొందించారు. దీనిపై ఇటీవల ఎంఆర్డీసీఎల్ 24వ బోర్డు భేటీ అయింది. ఆగస్టు నెలాఖరులోగా మాస్టర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ప్లాన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ డ్రాఫ్ట్ సిద్ధం కానుంది. మూసీ బ్యూటిఫికేషన్ ప్రాజెక్టు మొదటి దశలో ఉస్మాన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌సాగర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ డ్యామ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ డౌన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ స్ట్రీమ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ పాయింట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ నుంచి గౌరెల్లి సమీపంలోని ఔటర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ రింగ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ రోడ్డు వరకు, హిమాయత్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌సాగర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ డ్యామ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ డౌన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ స్ట్రీమ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ పాయింట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ నుంచి బాపూఘాట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లోని సంఘం వరకు 55 కిలోమీటర్ల మేర విస్తరణ, అభివృద్ధి చేపట్టాలని అధికారులు ప్రతిపాదించారు. మూసీ చుట్టూ ఉన్న వారసత్వ కట్టడాల పరిరక్షణ, పునరుద్ధరణ చేయాలని నిర్ణయించారు. ఎక్కడా ఇబ్బందులు లేకుండా, నది పరివాహక ప్రాంత ప్రజల నుంచి వ్యతిరేకత రాకుండా చర్యలు చేపట్టనున్నారు. 

నిరాశ్రయులకు డబుల్ ఇండ్లు 

మూసీ బ్యూటిఫికేషన్ లో భాగంగా బఫర్ జోన్ లో ఇండ్లు కోల్పోయే నిరాశ్రయులకు డబుల్ బెడ్​రూమ్​ఇండ్లు ఇవ్వాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఈ విషయమై గత నెలలో ఇందిరమ్మ ఇండ్లకు సంబంధించి హౌసింగ్ శాఖ అధికారులతో సీఎం రేవంత్ రెడ్డి భేటీ అయ్యారు. గ్రేటర్ సిటీలో నిర్మించిన డబుల్ బెడ్​రూమ్​ఇండ్లు ఎన్ని, లబ్ధిదారులకు కేటాయించినవి ఎన్ని, ఇంకెన్ని ఖాళీగా ఉన్నాయనే వివరాలు తెలుసుకున్నారు. లబ్ధిదారులకు ఇవ్వకుండా దాదాపు 30 వేల ఇండ్లు ఉన్నట్టు.. వాటిలో కొన్ని పనులు చేస్తేనే అప్పగించేందుకు వీలవుతుందని అధికారులు చెప్పారు. ఆ పనులకు మూసీ బ్యూటిఫికేషన్ కోసం తీసుకొచ్చే లోన్ పైసలు వాడాలని సర్కార్ నిర్ణయించింది. మూసీ బ్యూటిఫికేషన్​పనుల కంటే ముందు ఇండ్ల ప్రక్రియను అధికారులు పూర్తిచేయనున్నారు.