తల్లిపాలు ఉత్తమమైన, బలమైన, ఇమ్యూనిటీని పెంచే పాలు : గవర్నర్ తమిళి సై

తల్లిపాలు ఉత్తమమైన, బలమైన, ఇమ్యూనిటీని పెంచే పాలు : గవర్నర్ తమిళి సై

పాలను డొనేట్ చేస్తున్న తల్లులను సత్కరించాలని గవర్నర్ తమిళి సై సౌందరరాజన్ అన్నారు. కొండాపూర్ కిమ్స్ హాస్పటల్ లో హ్యుమన్ మిల్క్ బ్యాంక్ ను ప్రారంభించిన గవర్నర్... ఈ నెల ఎన్నో ప్రోగ్రామ్స్ కు అటెండ్ అయ్యానని. కానీ తనకు ఈ ప్రోగ్రాం అత్యంత కనెక్ట్ అయిందని చెప్పారు. పుట్టిన పిల్లలకు మిల్క్ బ్యాంక్ చాలా అవసరమని తెలిపారు. గైనకాలజిస్ట్ గా మిల్క్ బ్యాంక్ అవసరం తనకు బాగా తెలుసన్న తమిళి సై.. ఒక కేసు తరహా జ్ఞాపకాలను నెమరు వేసుకున్నారు. ఒక మహిళకు ట్విన్స్ పుట్టగా.. అందులో బేబీ బాయ్ వెయిట్ పెరుగుతుంటే... బేబీ గర్ల్ వెయిట్ మాత్రం తగ్గుతూ వచ్చిందని గవర్నర్ అన్నారు. ఈ విషయంపై తల్లిని అడిగితే... బ్రెస్ట్ మిల్క్ బాయ్ కి ఇస్తూ, ఆవు పాలు పాపకు పడుతుందని చెప్పడం తనకు చాలా బాధేసిందని ఆవేదన వ్యక్తం చేశారు.

తల్లి పాలు అందరి పిల్లలకూ అందాలని గవర్నర్ తమిళి సై చెప్పారు. ఒక తల్లి 16 లీటర్స్ మిల్క్ ను డొనేట్ చేయడం నిజంగా గర్వించదగ్గ విషయమని కొనియాడారు. బ్లడ్ ను డొనేట్ చేయడానికి కూడా ఆలోచిస్తున్న ఈ రోజుల్లో.. మిల్క్ ను డొనేట్ చేస్తున్న తల్లులను సత్కరించాలని సూచించారు. తల్లిపాలు ఉత్తమమైన పాలని, బలమైన పాలని, ఇమ్యూనిటీని పెంచే పాలని.. గవర్నర్ తెలుగులో చెప్పడం అందర్నీ ఆకట్టుకుంది.