Virat Kohli: కోహ్లీ సెంచరీ..ముందే ఊహించిన లారా..!

Virat Kohli: కోహ్లీ సెంచరీ..ముందే ఊహించిన లారా..!

లంకతో జరిగిన తొలి  వన్డేలో విరాట్ కోహ్లీ సెంచరీ చేశాడు. స్వదేశంలో దాదాపు వెయ్యి రోజుల తర్వా శతకం బాదాడు. అంతేకాదు ఈ ఏడాది ఆడిన తొలి వన్డేలోనే సెంచరీ చేసి..2023ను ఘనంగా ప్రారంభించాడు. అయితే కోహ్లీ సెంచరీ చేస్తాడని క్రికెట్ దిగ్గజం ముంచే ఊహించాడా..?
అందుకే ఇన్ స్టాగ్రామ్లో పోస్ట్ పెట్టాడా..? 


లంకతో తొలి వన్డేకు ముందు వరకు విరాట్ కోహ్లీ వన్డేలు, టెస్టులు, టీ20లు కలిపి 72 సెంచరీలు బాదాడు. అయితే ఈ ఏడాదిని కోహ్లీ ఘనంగా ఆరంభించాలని ..సెంచరీ చేయాలని అభిమానులు కోరుకున్నారు. అభిమానులతో పాటు..వెస్టిండీస్ దిగ్గజం బ్రియాన్ లారా కూడా కోహ్లీ సెంచరీ చేయాలని అనుకున్నట్లు ఉన్నాడు. కోరుకోవడమే కాదు..కోహ్లీ ఖచ్చితంగాసెంచరీ చేస్తాడని నమ్మినట్లు ఉన్నాడు. కోహ్లీ బ్యాటింగ్ కోసం డగౌట్లో వెయిట్ చేస్తుండగా..ఆ ఫోటోను తన ఇన్ స్టా గ్రామ్లో పోస్ట్ చేశాడు. విల్ వెయిట్ టూ అంటూ..కామెంట్ పెట్టాడు. లారా అనుకున్నట్లుగానే కోహ్లీ సెంచరీ సాధించాడు. ప్రస్తుతం లారా పెట్టిన పోస్ట్ వైరల్ అవుతోంది. 


శ్రీలంకతో జరిగిన తొలి వన్డేలో విరాట్ కోహ్లీ తన 73వ అంతర్జాతీయ సెంచరీని నమోదు చేశాడు.  52 పరుగులు, 81 పరుగుల వద్ద ఔటయ్యే ప్రమాదం నుంచి బయటపడిన కోహ్లీ..విజయవంతంగా 80 బంతుల్లోనే తన సెంచరీ సాధించాడు. మొత్తంగా  87 బంతుల్లో 113 పరుగులు చేసి ఔటయ్యాడు. కోహ్లి సెంచరీతో భారత్ తొలి వన్డేలో 7 వికెట్ల నష్టానికి 373 పరుగులు చేసింది. కెప్టెన్ రోహిత్ శర్మ 67 బంతుల్లో 83 పరుగులు చేయగా, శుభ్‌మన్ గిల్ 60 బంతుల్లో 70 పరుగులు చేశాడు. ఉమ్రాన్ మాలిక్ (3/57), మహ్మద్ సిరాజ్ (2/30)  రాణించడంతో  శ్రీలంక 50 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 306 పరుగులే ఓడిపోయింది.  శ్రీలంక తరఫున కెప్టెన్ దసున్ షనక (108 నాటౌట్) పరుగులు, పాతుమ్ నిస్సాంక 72 పరుగులు చేశాడు.