పెళ్లి డ్రెస్సులో వచ్చి ఓటేసిన వరుడు

పెళ్లి డ్రెస్సులో వచ్చి ఓటేసిన వరుడు

ఓ పెళ్లికొడుకు ఎన్నికల ఓటింగ్‌లో పాల్గొన్నారు. ముందు ఓటు హక్కు తర్వాతే పెళ్లి అని అతడు చెబుతున్నారు. ప్రస్తుతం యూపీలో తొలి విడత ఎన్నికల పోలింగ్ నడుస్తోంది.ఈ సందర్భంగా అంకుర్ అనే యువకుడు పెళ్లి వస్త్రాల్లో వచ్చి తన ఓటు హక్కును వినియోగించుకున్నాడు. ఈ ఘటన... యూపీలోని ముజ్‌ఫర్ నగర్‌లోని ఓ పోలింగ్ బూత్ వద్ద జరిగింది. ముందే ఓటు.. ఆ తర్వాతే.. పెళ్లి మిగిలిన పనులు అన్ని అతడు చెప్పాడు. 

మరోవైపు యూపీలో తొలి విడత ఎన్నికల పోలింగ్ కొనసాగుతోంది. ఓటర్లు భారీగా తరలివచ్చి తమ ఓటు హక్కును వినియోగించుకుంటున్నారు. మొదట విడతలో మొత్తం 58అసెంబ్లీ నియోజకవర్గాల్లో ఓటింగ్ కొనసాగుతోంది. 11 జిల్లాల్లో ఎన్నికల పోలింగ్ నడుస్తోంది. అటు పోలీసులు కూడా భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా సెక్యూరిటీ ఏర్పాటు చేశారు.  ఉత్తర ప్రదేశ్ లో ఉదయం 11 గంటల వరకు 20.03 శాతం పోలింగ్ నమోదైంది. వెస్ట్ యూపీలోని 58 అసెంబ్లీ స్థానాలకు పోలింగ్ కొనసాగుతోంది. సాయంత్రం 6 గంటల వరకు తొలి దశ పోలింగ్ కొనసాగనుంది. 403 అసెంబ్లీ స్థానాలకు 7 దశల్లో యూపీ అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. 

ఇవి కూడా చదవండి:

ఉత్తర ప్రదేశ్ లో 11 గంటల వరకు 20.03 శాతం పోలింగ్

 

ఏపీలో అక్రమ మద్యంపై ఉక్కుపాదం