
అహ్మదాబాద్: గుజరాత్ రాష్ట్రంలోని అహ్మదాబాద్ లో నిర్మాణంలో ఉన్న ఓ బ్రిడ్జి కూలిపోయింది. సర్దార్ పటేల్ రింగ్ రోడ్డుకు దగ్గరలో నిర్మిస్తున్న బ్రిడ్జి కూలిపోవడం ఆందోళన కలిగించింది. అయితే రాత్రి సమయంలో ఈ ప్రమాదం జరగడంతో ఎలాంటి ప్రాణనష్టం జరగలేదని అధికారులు అన్నారు. నిర్మాణ పనుల నాణ్యతపై ఆరా తీస్తున్నామని.. బ్రిడ్జి ఎందుకు కూలిపోయిందో తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నామన్నారు.
Gujarat | Portion of an under-construction bridge on Sardar Patel Ring Road in Ahmedabad collapsed last night. No casualty was reported in the incident. pic.twitter.com/CkvUMoe5O0
— ANI (@ANI) December 22, 2021
కాగా, బ్రిడ్జి నిర్మాణంలో వాడిన మెటీరియల్స్ నాణ్యతపై పలువురు సందేహం వ్యక్తం చేస్తున్నారు. నిర్మాణ పనుల పర్యవేక్షణ పైనా పలు అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి.
మరిన్ని వార్తల కోసం: