ఉమ్మడి అదిలాబాద్ జిల్లా సంక్షిప్త వార్తలు

ఉమ్మడి అదిలాబాద్ జిల్లా సంక్షిప్త వార్తలు

నిర్మల్,వెలుగు: నిర్మల్ నియోజవర్గంలోని సమస్యలు దశలవారీగా పరిష్కరించి అభివృద్ధికి కృషిచేస్తున్నట్లు మంత్రి ఇంద్రకరణ్​రెడ్డి చెప్పారు. ఆర్టీసీ రిటైర్డు ఉద్యోగులకు అండగా ఉంటామని తెలిపారు. ఆదివారం మంత్రి కలెక్టర్ ముషారఫ్​అలీ ఫారూఖీ, మున్సిపల్ చైర్మన్ ఈశ్వర్ తదితరులతో కౌట్ల వరకు నిర్మిస్తున్న రోడ్డు, సిద్దాపూర్ వద్ద నిర్మిస్తు న్న డబుల్ బెడ్ రూమ్ ఇండ్లను పరిశీలించారు. అనంతరం రిటైర్డ్ ఆర్టీసీ ఉద్యోగులు ఏర్పాటు చేసిన సమావేశంలో మాట్లాడారు. నిర్మల్ నియోజకవర్గాన్ని రాష్ట్రంలోనే మోడల్​గా తీర్చిదిద్దేందుకు కృషిచేస్తున్నట్లు తెలిపారు. సిద్దాపూర్ లో మరో 600 డబుల్​బెడ్​రూమ్​ ఇండ్లు నిర్మిస్తామన్నారు. కార్యక్రమంలో అడిషనల్ కలెక్టర్ హేమంత్ బోర్కడే, మార్కెట్ కమిటీ చైర్మన్ చిలుక రమణ, ఎఫ్ఎస్ సీఎస్ చైర్మన్ ధర్మాజీ రాజేందర్ తరులున్నారు.


ఆధ్యాత్మికతతో ప్రశాంతత

నిర్మల్/ఆదిలాబాద్​టౌన్, వెలుగు: ఆధ్యాత్మికతతో ప్రశాంతత చేకూరుతుందని మంత్రి ఇంద్రకరణ్​రెడ్డి చెప్ఆపరు. నిర్మల్​ మల్లన్న గుట్ట  హరిహర క్షేత్రంలో జరిగిన అయ్యప్ప పడిపూజకు మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి, విజయలక్ష్మి దంపతులు  హాజరయ్యారు. కార్యక్రమంలో గురుస్వాములు మూర్తి, వేణుగోపాల్ రెడ్డి, భూషణ్ రెడ్డి, రామకృష్ణారెడ్డి తదితరులు పాల్గొన్నారు. ఆదిలాబాద్​ బెల్లూరి అయ్యప్ప ఆలయం ఆధ్వర్యంలో నిర్వహించిన అయ్యప్ప ఆరట్టు ఉత్సవానికి  గోపాలకృష్ణ మఠాధిపతి యోగానంద సరస్వతి హాజరయ్యారు. ఎమ్మెల్యే జోగు రామన్న, డీసీసీబీ చైర్మన్​ అడ్డి భోజారెడ్డి, బీజేపీ జిల్లా అధ్యక్షుడు పాయల్​ శంకర్​పల్లకి సేవలో పాల్గొన్నారు. 

 

ఎన్నికలకు రెడీగా ఉండాలి: పాయల్​ శంకర్​

ఆదిలాబాద్ టౌన్,వెలుగు: వచ్చే సార్వత్రిక ఎన్నికలకు కార్యకర్తలంతా రెడీగా ఉండాలని బీజేపీ జిల్లా అధ్యక్షుడు పాయల్​శంకర్​ కోరారు. ఆదివారం స్థానిక గుజరాతీ భవన్​లో నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు. పార్టీ బూత్​స్థాయి నుంచి బలోపేతం చేయాలని, ప్రతీ కార్యకర్త ప్రజలకు అందుబాటులో ఉండాలని సూచించారు. రాష్ట్రంలో సీఎం కేసీఆర్ ప్రజావ్యతిరేక పాలనను వివరించాలన్నారు. ఈ సందర్భంగా పలు తీర్మానాలు చేశారు. సమావేశంలో మాజీ ఎంపీ రాథోడ్ రమేశ్, జడ్పీ మాజీ చైర్​పర్సన్​సుహాసినిరెడ్డి, జిల్లా అధికార ప్రతినిధి లోక ప్రవీణ్​రెడ్డి, వకులాభరణం ఆదినాథ్, వేద వ్యాస్, లాలా మున్నా తదితరులు 
పాల్గొన్నారు.


క్రీయాశీలకంగా పనిచేస్తాం

నిర్మల్,వెలుగు: కేంద్ర ప్రభుత్వ అభివృద్ధి సంక్షేమ పథకాలపై ప్రచారం చేసేందుకు క్రీయాశీలకంగా పనిచేస్తామని బీజేవైఎం రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు అనుముల శ్రావణ్ కుమార్ చెప్పారు. ఆదివారం ఆయన స్థానికంగా మాట్లాడారు. సెంట్రల్​స్కీమ్స్​గడపగడపకు తీసుకెళ్తామన్నారు. రాష్ట్ర ప్రభుత్వం అమలుచేస్తున్న ప్రజావ్యతిరేక విధానాలు వివరిస్తామన్నారు. వచ్చే ఎన్నికల్లో బీజేపీని అధికారంలోకి తీసుకురావడమే లక్ష్యంగా కార్యకర్తలు పనిచేస్తారన్నారు.
 

రైస్​ మిల్లుల తనిఖీ


జైపూర్,వెలుగు: టేకుమట్ల, కుందారం, పౌనూర్ గ్రామాల్లోని రైస్ ​మిల్లులను ఆదివారం అడిషనల్​​కలెక్టర్​మధుసూదన్ నాయక్ తనిఖీ చేశారు. గత ఏడాది కస్టమ్​ మిల్లింగ్ ​రైస్​ ప్రభుత్వానికి అప్పగించకపోవడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ ఏడాది మిల్లులకు ధాన్యం సరఫరా నిలిపివేయాలని డీఎస్​వోను ఆదేశించారు.
 

స్లాటర్​ హౌస్​ను తరలించాలి

ఆదిలాబాద్​టౌన్,వెలుగు: ఆదిలాబాద్ పట్ట ణంలోని ఇందిరమ్మ కాలనీకి వెళ్లే మార్గంలోని స్లాటర్​హౌస్​ను ప్రభుత్వం వెంటనే తరలించాలని జడ్పీ మాజీ చైర్ పర్సన్, బీజేపీ స్టేట్​ లీడర్ సుహాసిని రెడ్డి డిమాండ్​చేశారు. ఆదివారం కాలనీవాసులతో కలిసి అంకోలి రోడ్డుపై ధర్నా నిర్వహించారు. ఆఫీసర్లు స్పందించకుంటే ఆందోళన ఉధృతం చేస్తామని హెచ్చరించారు.