ఉమ్మడి మెదక్ జిల్లా సంక్షిప్త వార్తలు

ఉమ్మడి మెదక్ జిల్లా సంక్షిప్త వార్తలు

కోహెడ(హుస్నాబాద్​), వెలుగు : తెలంగాణలో టీఆర్​ఎస్​కు ప్రత్యామ్నాయం బీజేపీయేనని, రానున్న ఎన్నికల్లో రాష్ట్రంలో అధికారంలోకి రావడం ఖాయమని బీజేపీ నేత జన్నపురెడ్డి సురేందర్​రెడ్డి(జేఎస్సార్) స్పష్టం చేశారు. ఎప్పుడు ఎన్నికలు వచ్చినా టీఆర్​ఎస్​​కు బుద్ధి చెప్పేందుకు ప్రజలు సిద్ధంగా ఉన్నారన్నారు. బీజేపీలో చేరి మొదటిసారిగా హుస్నాబాద్​ నియోజకవర్గానికి వచ్చిన జేఎస్సార్​కు గురువారం కోహెడలో పార్టీ నాయకులు ఘన స్వాగతం పలికారు. కోహెడ నుంచి హుస్నాబాద్​వరకు భారీ బైక్​ ర్యాలీ నిర్వహించారు. అనంతరం ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడారు. హుస్నాబాద్​ చుట్టూ ఉన్న హుజూరాబాద్, సిద్దిపేట బ్రహ్మాండంగా అభివృద్ధి చెందితే, స్థానిక ఎమ్మెల్యే అసమర్థతతో హుస్నాబాద్​ ప్రాంతం అభివృద్ధిలో 10 ఏండ్లు  వెనక్కు వెళ్లిందన్నారు. తన అభిమానులు బైక్​ ర్యాలీతో స్వాగతం పలుకుతుండగా గిట్టని అధికార పార్టీ నాయకులు అడ్డుకునే ప్రయత్నం చేశారని ఆరోపించారు. ఎన్ని అడ్డంకులు సృష్టించినా హుస్నాబాద్​ గడ్డ బీజేపీ అడ్డా కాబోతుందని ఆయన స్పష్టం చేశారు. రాష్ట్ర ప్రభుత్వం గౌరవెల్లి భూనిర్వాసితులను ఆదుకోవాల్సింది పోయి వారికి సంకెళ్లు వేసి జైల్​ లో  పెట్టడం దారుణమన్నారు. సీఎం కేసీఆర్​ రాష్ర్టాన్ని తాగుబోతుల తెలంగాణగా మార్చారని దుయ్యబట్టారు. కాంగ్రెస్ ​భారత్​ జోడో యాత్ర పేరుతో కొత్త నాటకం ఆడుతోందని, దీనిని గమనించాలని సూచించారు. బీజేపీ నాయకులు, కార్యకర్తలు కలిసి కట్టుగా పని చేసి రాష్ట్రంలో రానున్న ఎన్నికల్లో అధికారమే ధ్యేయంగా పని చేయాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో సిద్దిపేట, కరీంనగర్​ జిల్లా అధ్యక్షులు దూది శ్రీకాంత్​రెడ్డి, గంగిడి కృష్ణారెడ్డి, ప్రవీణ్​రావు, రాంగోపాల్​రెడ్డి, శ్రీరాం చక్రవర్తి, వెంకటేశం, విద్యాసాగర్​రెడ్డి, చీరంజీవి, పృధ్విరాజు, మ్యాకల రజనీకాంత్​రెడ్డి, గోవిందు వెంకటేశం, తిరుపతిరెడ్డి, తిరుపతి, సర్పంచ్, ఎంపీటీసీలు పాల్గొన్నారు.

శుభ్రతతోనే నులి పురుగుల నిర్మూలన

మెదక్​ టౌన్/దుబ్బాక, వెలుగు: ఇంటి పరిసరాలు, వ్యక్తిగత పరిశుభ్రతతోనే నులి పురుగులను నిర్మూలించవచ్చని మెదక్​ అడిషనల్​ కలెక్టర్ ​ప్రతిమాసింగ్, దుబ్బాక ఎమ్మెల్యే రఘునందన్​రావు తెలిపారు. జాతీయ నులిపురుగుల నిర్మూలన దినోత్సవం సందర్భంగా గురువారం మెదక్​ పరిధిలోని తెలంగాణ మైనారిటీ మహిళా గురుకుల పాఠశాలలో అడిషనల్ ​కలెక్టర్,  దుబ్బాక పట్టణ పరిధిలోని లచ్చపేట మోడల్ ​స్కూల్ లో ఎమ్మెల్యే విద్యార్థులకు ఆల్బెండజోల్ ​మాత్రలు వేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ 19 ఏండ్లలోపు పిల్లలకు తప్పనిసరిగా ఆల్బెండజోల్ మాత్రలు వేసుకోవాలని సూచించారు. ఆరుబయట టాయిలెట్​ వెళ్లొద్దని, నోటితో గోళ్లను కొరకడం లాంటివి చేయొద్దని సూచించారు. భోజనం చేసే ముందు చేతులు,  కాళ్లు శుభ్రంగా కడుక్కోవాలన్నారు. చదువుతో పాటు విద్యార్థులకు శారీరక శ్రమ కోసం క్రీడలు ముఖ్యమని సూచించారు.  గురువారం అనివార్య కారణాలతో మాత్రలు తీసుకోలేని వారికి ఈ నెల 22న పంపిణీ చేయనున్నట్లు తెలిపారు. 

‘రుతు ప్రేమ’పై  అవగాహన 

సిద్దిపేట రూరల్, వెలుగు : నారాయణరావుపేట మండలం గుర్రాలగొంది గ్రామంలో రుతు ప్రేమ కార్యక్రమంపై మహిళలకు అవగాహన కల్పించారు.  శానిటర్ కప్స్ అందజేశారు. ఈ సందర్భంగా జడ్పీ చైర్​ పర్సన్ రోజా రాధాకృష్ణ శర్మ మాట్లాడారు. మార్పు కోసం ప్రతి మహిళా నడుము బిగించాలని పిలుపునిచ్చారు. మహిళల ఆరోగ్య సంరక్షణకు ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించినట్లు తెలిపారు. అనంతరం సిద్దిపేట రూరల్ మండలం ఇర్కోడ్ గ్రామంలోని మోడల్  స్కూల్ లో స్టూడెంట్స్ కు రుతు ప్రేమ కార్యక్రమంపై అవగాహన కల్పించారు. రుతుస్రావ కప్పులు, బట్ట ప్యాడ్ లను అందజేశారు. 

‘పల్లె ప్రగతి’ పనులను 

కొండాపూర్, వెలుగు : జల శక్తి అభియాన్ క్యాచ్ ద రైన్ ప్రోగ్రామ్ లో భాగంగా శనివారం తొగర్ పల్లి, ఆలియాబాద్, మాందాపూర్, హరిదాస్ పూర్ పూర్ లోని పల్లె ప్రగతి పనులను సెంట్రల్ డిప్యూటీ కమిషనర్, సీడబ్ల్యూసీ డిప్యూటీ డైరెక్టర్ అరవింద్ నాథ్, మహేశ్​కుమార్ గుప్తా పరిశీలించారు. పల్లె పకృతివనం, ఫామ్ ఫండ్, అమృత్ సరోవర్, ఎంఐ ట్యాంక్, రూఫ్ టాప్ వాటర్, హార్వెస్ట్ స్ట్రక్చర్ పనులను సందర్శించి సంతృప్తి వ్యక్తం చేశారు. పల్లెల అభివృద్ధితో దేశం ప్రపంచంలో అగ్రగామిగా నిలుస్తుందన్నారు. కార్యక్రమంలో డీఆర్ డీఏ శ్రీనివాస్ రావు, డీఆర్ డీవో జయదేవ్ ఆర్య,  అడిషనల్ డీఆర్ డీవో వామన్ రావు, ఏపీడీ రాంబాబు పాల్గొన్నారు.

శుభ్రతతోనే నులి పురుగుల నిర్మూలన

మెదక్​ టౌన్/దుబ్బాక, వెలుగు: ఇంటి పరిసరాలు, వ్యక్తిగత పరిశుభ్రతతోనే నులి పురుగులను నిర్మూలించవచ్చని మెదక్​ అడిషనల్​ కలెక్టర్ ​ప్రతిమాసింగ్, దుబ్బాక ఎమ్మెల్యే రఘునందన్​రావు తెలిపారు. జాతీయ నులిపురుగుల నిర్మూలన దినోత్సవం సందర్భంగా గురువారం మెదక్​ పరిధిలోని తెలంగాణ మైనారిటీ మహిళా గురుకుల పాఠశాలలో అడిషనల్ ​కలెక్టర్,  దుబ్బాక పట్టణ పరిధిలోని లచ్చపేట మోడల్ ​స్కూల్ లో ఎమ్మెల్యే విద్యార్థులకు ఆల్బెండజోల్ ​మాత్రలు వేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ 19 ఏండ్లలోపు పిల్లలకు తప్పనిసరిగా ఆల్బెండజోల్ మాత్రలు వేసుకోవాలని సూచించారు. ఆరుబయట టాయిలెట్​ వెళ్లొద్దని, నోటితో గోళ్లను కొరకడం లాంటివి చేయొద్దని సూచించారు. భోజనం చేసే ముందు చేతులు,  కాళ్లు శుభ్రంగా కడుక్కోవాలన్నారు. చదువుతో పాటు విద్యార్థులకు శారీరక శ్రమ కోసం క్రీడలు ముఖ్యమని సూచించారు.  గురువారం అనివార్య కారణాలతో మాత్రలు తీసుకోలేని వారికి ఈ నెల 22న పంపిణీ చేయనున్నట్లు తెలిపారు. 

‘రుతు ప్రేమ’పై అవగాహన 

సిద్దిపేట రూరల్, వెలుగు : నారాయణరావుపేట మండలం గుర్రాలగొంది గ్రామంలో రుతు ప్రేమ కార్యక్రమంపై మహిళలకు అవగాహన కల్పించారు.  శానిటర్ కప్స్ అందజేశారు. ఈ సందర్భంగా జడ్పీ చైర్​ పర్సన్ రోజా రాధాకృష్ణ శర్మ మాట్లాడారు. మార్పు కోసం ప్రతి మహిళా నడుము బిగించాలని పిలుపునిచ్చారు. మహిళల ఆరోగ్య సంరక్షణకు ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించినట్లు తెలిపారు. అనంతరం సిద్దిపేట రూరల్ మండలం ఇర్కోడ్ గ్రామంలోని మోడల్  స్కూల్ లో స్టూడెంట్స్ కు రుతు ప్రేమ కార్యక్రమంపై అవగాహన కల్పించారు. రుతుస్రావ కప్పులు, బట్ట ప్యాడ్ లను అందజేశారు. 

సమైక్యతా వజ్రోత్సవాలను ఘనంగా నిర్వహించాలి

జహీరాబాద్/నారాయణ్ ఖేడ్, వెలుగు : జాతీయ సమైక్యతా వజ్రోత్సవాలను ఘనంగా నిర్వహించాలని సంగారెడ్డి కలెక్టర్ డాక్టర్ ఏ.శరత్, ఎస్పీ రమణకుమార్ అధికారులకు సూచించారు. గురువారం జహీరాబాద్​లో ఎమ్మెల్యే మాణిక్​రావుతో కలిసి, అనంతరం ఖేడ్​లోని తహసీల్దార్​ గ్రౌండ్​లోని నిర్వహణ ఏర్పాట్లను వారు పరిశీలించారు. ఆయా కార్యక్రమాలకు నియోజకవర్గంలోని మండలాల నుంచి వచ్చే వారికి ఎలాంటి ఇబ్బందులు కలుగకుండా తీసుకోవాల్సిన చర్యలు, శనివారం హైదరాబాద్ లో  నిర్వహించనున్న కార్యక్రమాలను విషయమై పలు సూచనలు చేశారు. 
సక్సెస్ ​చేయాలి 
మెదక్​టౌన్, వెలుగు :  తెలంగాణ జాతీయ సమైక్యతా వజ్రోత్సవాలను జిల్లా వ్యాప్తంగా సక్సెస్​ చేయాలని మెదక్​ కలెక్టర్​హరీశ్​ గురువారం ఒక ప్రకటనలో కోరారు. శుక్రవారం నుంచి మూడు రోజుల పాటు నిర్వహించే ఈ ఉత్సవాలలో ప్రజలు, ప్రజాప్రతినిధులు అధిక సంఖ్యలో పాల్గొని సమైక్యతా స్ఫూర్తిని చాటాలని పిలుపునిచ్చారు. 

ఆంజనేయస్వామి హుండీ ఆదాయం రూ.5.77 లక్షలు

మెదక్​ (శివ్వంపేట), వెలుగు: మెదక్​ జిల్లా శివ్వంపేట మండలం చిన్నగొట్టిముక్ల గ్రామ పరిధిలోని చాకరి మెట్ల సహకార ఆంజనేయ స్వామి ఆలయం  హుండీని గురువారం లెక్కించారు. ఈవో సార శ్రీనివాస్,  చైర్మన్​ ఆంజనేయ శర్మ ఆధ్వర్యంలో సిబ్బంది హుండీ లెక్కించగా రూ.5.77 లక్షల ఆదాయం సమకూరింది.  

రజాకార్ల దాష్టీకాన్ని తెలంగాణ ప్రజానీకం మర్చిపోదు

సిద్దిపేట రూరల్/సంగారెడ్డి​టౌన్/నారాయణ్ ఖేడ్, వెలుగు :  ఈ ప్రాంత ప్రజలపై, మహిళలపై రజాకార్ల దాష్టీకాన్ని తెలంగాణ ప్రజానీకం మర్చిపోదని బీజేపీ మహిళా మోర్చా సిద్దిపేట, సంగారెడ్డి జిల్లా ప్రెసిడెంట్లు గాడిపల్లి అరుణ రెడ్డి, మాధురి, రాష్ట్ర సెన్సార్ బోర్డ్ మెంబర్ లక్కీరెడ్డి తిరుమల స్పష్టం చేశారు. తెలంగాణ విమోచన దినోత్సవం కార్యక్రమాల్లో భాగంగా గురువారం సిద్దిపేటలో పార్టీ కార్యాలయం వద్ద బీజేపీ మహిళా మోర్చా ఆధ్వర్యంలో చేపట్టిన ర్యాలీని బీజేపీ జిల్లా అధ్యక్షుడు దూది శ్రీకాంత్ రెడ్డితో కలిసి అరుణరెడ్డి, లక్కీరెడ్డి తిరుమల ప్రారంభించారు.  నారాయణఖేడ్ పట్టణంలో బీజేవైఎం, సంగారెడ్డిలో  మహిళా మోర్చా ఆధ్వర్యంలో బైక్ ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ తెలంగాణ ప్రభుత్వం సమైక్యతా రాగం పక్కనపెట్టి తెలంగాణ విమోచన దినంగా కార్యక్రమాలు నిర్వహించాలని డిమాండ్ 
చేశారు. 

వ్యవసాయ మోటార్లకు మీటర్లు పెట్టనియ్యం

రామాయంపేట, వెలుగు:  వ్యవసాయ మోటార్లకు మీటర్లు పెట్టుమని కేంద్రం ఒత్తిడి తెస్తోందని, తాము ఎట్టి పరిస్థితుల్లో మీటర్లు పెట్టనియ్యమని మెదక్ ఎమ్మెల్యే పద్మా దేవేందర్ రెడ్డి అన్నారు. రామాయంపేటలో రూ.20 లక్షలతో  నిర్మించిన పీఏసీఎస్ భవనాన్ని గురువారం ఆమె ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ రైతులకు సొసైటీల ద్వారా ఎంతో మేలు జరుగుతోందన్నారు. తెలంగాణ వచ్చాక సొసైటీలు అభివృద్ధి చెందాయని, ధాన్యం కొనుగోలుతో పాటు, ఎరువుల విక్రయాలు జరుగుతున్నాయని తెలిపారు. కార్యక్రమంలో డీసీసీబీ చైర్మన్​ దేవేందర్ రెడ్డి, పీఏసీఎస్ చైర్మన్ బాదే చంద్రం, సీఈవో నర్సింలు, మున్సిపల్ చైర్మన్ జితేందర్ గౌడ్, మార్కెట్ కమిటీ చైర్మన్ సరాఫ్ యాదగిరి, కౌన్సిలర్ గజవాడ నాగరాజు పాల్గొన్నారు. 

సమన్వయంతో సమస్యలను పరిష్కరించాలి

సిద్దిపేట రూరల్, వెలుగు : లా అండ్ ప్రాబ్లం ఉన్నప్పుడు సమన్వయంతో విధులు నిర్వహించి సమస్యను త్వరగా పరిష్కరించాలని సిద్దిపేట సీపీ ఎన్.శ్వేత అధికారులకు సూచించారు. గురువారం సీఏఆర్ హెడ్ క్వార్టర్ లో పోలీసులకు పలు అంశాల పై సూచనలు చేశారు. ఏదైనా సంఘటన జరిగినప్పుడు అక్కడ ఉండే సీనియర్ అధికారి సలహాలు, సూచనలు తప్పకుండా పాటించాలన్నారు. ఈ నెల 16 నుంచి 18 వరకు నిర్వహించే తెలంగాణ జాతీయ సమైక్యత వజ్రోత్సవాలు డిపార్ట్​మెంట్ తరఫున ఘనంగా నిర్వహించడానికి చర్యలు తీసుకోవాలన్నారు. కార్యక్రమంలో అడిషనల్ డీసీపీ అడ్మిన్ మహేందర్, ఏఆర్ అడిషనల్ డీసీపీలు రామచందర్రావు,  సుభాష్ చంద్రబోస్, ఏసీపీ లు దేవా రెడ్డి, రమేశ్, సతీశ్, ట్రాఫిక్ ఏసీపీ ఫణిందర్, రిజర్వ్ ఇన్స్​పెక్టర్లు శ్రీధర్ రెడ్డి, ధరణి కుమార్, రాజశేఖర్ రెడ్డి, రామకృష్ణ పాల్గొన్నారు.

పల్లెలు అభివృద్ధి  చెందుతున్నయ్​

చేర్యాల, వెలుగు : టీఆర్ఎస్​ ప్రభుత్వం హయాంలోనే పల్లె సీమలు అభివృద్ధి చెందుతున్నాయని ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డి అన్నారు. గురువారం మండలంలోని వీరన్నపేట గ్రామంలో జిల్లా ప్రజా పరిషత్​ నిధులతో చేపడుతున్న అండర్​ గ్రౌండ్​ డ్రైనేజీ పనులను ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ దేశంలో ఎక్కడాలేని విధంగా రాష్ట్రంలో అనేక సంక్షమ పథకాలను అందజేస్తున్న ఘనత సీఎం కేసీఆర్​కే దక్కుతుందన్నారు. అనంతరం ఆయన సమక్షంలో గ్రామంలోని కాంగ్రెస్​ పార్టీకి చెందిన 50 మంది కార్యకర్తలు టీఆర్​ఎస్​లో చేరారు. కార్యక్రమంలో సర్పంచ్​కొండపాక భిక్షపతి, ఎంపీపీ ఉల్లంపల్లి కర్ణాకర్, ఎంపీటీసీ శివశంకర్, ఉపసర్పంచ్, వెంకటేశం, సర్పంచ్​ల ఫోరం అధ్యక్షుడు పీ.ఎల్లారెడ్డి, పార్టీ మండల అధ్యక్షుడు అనందుల మల్లేశం, కోఆఫ్షన్​ సభ్యులు వీ.శ్రీనివాస్ పాల్గొన్నారు. 

‘బీహెచ్​ఈఎల్​’కు నేషనల్​ అవార్డు

రామచంద్రాపురం, వెలుగు : బీహెచ్​ఈఎల్​ రామచంద్రాపురం యూనిట్​కు నేషనల్​అవార్డు దక్కింది. దేశంలో క్వాలిటీ కంట్రోల్​ఉద్యమానికి మద్దతునిచ్చే ఉత్తమ సంస్థగా గుర్తింపు లభించింది. ఇందుకు బెస్ట్​ ఆర్గనైజేషన్​ సపోర్టింగ్ క్వాలిటీ కంట్రోల్​ మూవ్​మెంట్ ఇన్​ ద కంట్రీ అవార్డును గురువారం మేరీగోల్డ్​ హోటల్​లో జరిగిన 36వ అన్యువల్​చాప్టర్​ కన్వెన్షన్ ప్రోగ్రాంలో క్వాలిటీ సర్కిల్​ ఫోరం ఆప్​ ఇండియా ప్రదానం చేసింది. అవార్డును బీహెచ్​ఈఎల్​జనరల్​ మేనేజర్​ బీ. శ్రీనివాస్, ఏజీఎం అశోక్​ కుమార్​కు మంత్రి కేటీఆర్​అందజేశారు. 


నేడు సంగారెడ్డిలో 15 వేల మందితో సభ

కంది, వెలుగు :  తెలంగాణ జాతీయ సమైక్యతా వజ్రోత్సవాల సందర్భంగా సంగారెడ్డిలో శుక్రవారం 15 వేల మందితో సభ నిర్వహించనున్నట్లు జిల్లా టీఆర్ఎస్ అధ్యక్షుడు, తెలంగాణ హ్యాండ్లూమ్ డెవలప్​మెంట్ కార్పొరేషన్  చైర్మన్ చింత ప్రభాకర్ తెలిపారు. గురువారం సంగారెడ్డి పట్టణంలోని అంబేద్కర్ గ్రౌండ్ లో సభా స్థలాన్ని, ఏర్పాట్లను కమిషనర్ చంద్రశేఖర్ తో కలిసి ఆయన పరిశీలించారు. నియోజకవర్గంలో శుక్రవారం భారీ ర్యాలీ, బహిరంగ సభ నిర్వహించనున్నట్లు తెలిపారు.