ఉమ్మడి మెదక్ జిల్లా సంక్షిప్త వార్తలు

ఉమ్మడి మెదక్ జిల్లా సంక్షిప్త వార్తలు

నారాయణ్ ఖేడ్, వెలుగు :  ‘ప్రజాగోస బీజేపీ భరోసా’ కార్యక్రమంలో భాగంగా నియోజకవర్గంలోని మనూరు మండలం ఎంజి ఉక్రాన గ్రామంలో బుధవారం టీఆర్ఎస్ నుంచి పలువురు నాయకులు బీజేపీలో చేరారు.  ఈ సందర్భంగా నిజామాబాద్ మాజీ ఎమ్మెల్యే లక్ష్మీనారాయణ,  నారాయణఖేడ్ మాజీ ఎమ్మెల్యే విజయ్ పాల్ రెడ్డి, బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధి సంగప్ప, పార్లమెంట్ ఇన్​చార్జి రవి కుమార్ గౌడ్ మాట్లాడారు. పక్కనే మంజీరా నదీ ఉన్నప్పటికీ టీఆర్ఎస్ ప్రభుత్వం రైతులకు సాగునీరు అందించకుండా,  లిఫ్ట్ లు రిపేర్ చేయకుండా నిర్లక్ష్యం చేస్తోందన్నారు.  కొత్తగా బసవేశ్వర  లిఫ్ట్ ఇరిగేషన్  నిర్మిస్తామని మాయ మాటలు చెబుతోందని మండిపడ్డారు.  ప్రధాని మోడీ పాలనకు ఆకర్షితులైన యువత పెద్ద సంఖ్యలో బీజేపీలో చేరడం శుభపరిణామమన్నారు. కార్యక్రమంలో బీజేపీ నాయకులు మారుతి రెడ్డి, మోహన్ రెడ్డి, సంజు పాటిల్, రాజు గౌడ్, సాయిరాం, మాణిక్యం, 
కార్యకర్తలు పాల్గొన్నారు.  

మల్లన్న ఆలయ చైర్మన్​గా గీస భిక్షపతి 

కొమురవెల్లి, వెలుగు :  కొమురవెల్లి మల్లికార్జునస్వామి  ఆలయ చైర్మన్​గా గీస భిక్షపతిని మండలి సభ్యులు ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. బుధవారం ఆలయ ధర్మకర్తల మండలి 14 మంది సభ్యులతోపాటు  పాటు ఎక్స్ అఫీషియో సభ్యుడితో ఆలయ ఈఓ బాలాజీ, మెదక్ ఏసీ సుధాకర్ రెడ్డి బుధవారం ప్రమాణస్వీకారం చేయించారు. కార్యక్రమానికి ఎమ్మెల్సీ బండ ప్రకాశ్, టీఆర్ఎస్ పార్టీ జనగామ నియోజకవర్గ కోఆర్డినేటర్ గుజ్జ సంపత్ రెడ్డి ముఖ్యఅతిథిలుగా హాజరయ్యారు. కాగా, సభ్యులుగా గీస భిక్షపతి, మరుపల్లి శ్రీనివాస్ గౌడ్, నర్రా రఘువీరారెడ్డి, చెట్టుకూరి తిరుపతి, కాసరాల కనకరాజు, జటోతు స్వప్న, ఇరగొల్ల మల్లేశం, కందుకూరి సిద్ధిలింగం, బోయిన సాయి కుమార్, కొంగరి గిరిధర్, గడ్డం మల్లేశ్​యాదవ్, పచ్చిమండ్ల సిద్ధిరాములు, నామిరెడ్డి సౌజన్య, సూటిపల్లి బుచ్చిరెడ్డిలతో పాటు ఎక్స్ అఫీషియో సభ్యుడిగా ఆలయ ప్రధాన అర్చకుడు మహాదేవుని మల్లికార్జున్ ప్రమాణస్వీకారం చేశారు. కార్యక్రమంలో తహసీల్దార్ లక్ష్మీనారాయణ, ఎంపీపీలు తలారి కీర్తన, కర్ణాకర్ జడ్పీటీసీలు సిల్వేరి సిద్ధప్ప, మల్లేశం, చేర్యాల మార్కెట్ కమిటీ చైర్మన్ సుంకరి మల్లేశం గౌడ్, సర్పంచులు సార్ల లత, భీమనపల్లి కరుణాకర్, పచ్చిమడ్ల స్వామి, ఎంపీటీసీలు కాయిత రాజేందర్ రెడ్డి, సాయి మల్లు పాల్గొన్నారు. 

అభివృద్ధిలో పటాన్​ చెరు ఆదర్శంగా నిలవాలి

పటాన్​చెరు, వెలుగు : పటాన్​చెరు మండలం పరిధిలోని అన్ని గ్రామాలు ఆదర్శంగా ఉండేలా కృషి చేయాలని పటాన్ ​చెరు ఎమ్మెల్యే మహిపాల్ రెడ్డి అధికారులుకు సూచించారు.  బుధవారం పటాన్​చెరు ఎంపీపీ కార్యాలయంలో ఎంపీపీ సుష్మ  అధ్యక్షతన సర్వసభ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ఇటీవల కర్దనూరు గ్రామపంచాయతీకి ఉత్తమ అవార్డు వచ్చినందుకు సర్పంచును పంచాయతీ కార్యదర్శిని అభినందించారు. పటాన్​చెరు మండలంలోని 19 గ్రామ పంచాయతీలలో అభివృద్ధి పనులు వేగంగా జరుగుతున్నాయని తెలిపారు. కార్యక్రమంలో ఎంపీడీవో బన్సీలాల్, జడ్పీటీసీ సుప్రజా వెంకట్ రెడ్డి, తహసీల్దార్ మైపాల్ రెడ్డి, ఎంపీవో హరి శంకర్ గౌడ్, సర్పంచులు ఉపేందర్, శ్రీశైలం, రాజ్ కుమార్, నర్సింలు, నారాయణరెడ్డి, జగన్, భాగ్యలక్ష్మి, ఎంపీటీసీలు కుమ్మరి యాదగిరి, గడిల కుమార్ గౌడ్, వైస్ ఎంపీపీ కల్పన, పీఏసీఎస్​ చైర్మన్ నారాయణరెడ్డి, తదితరులు పాల్గొన్నారు. 

అర్హులందరికీ ఇండ్లు, స్థలాలు ఇవ్వాలి

మెదక్ ​టౌన్​/సంగారెడ్డి టౌన్, వెలుగు: అర్హులైన పేదలందరికీ ఇండ్లు, ఇండ్ల స్థలాలు ఇవ్వాలని, కాస్తులో ఉన్న ప్రభుత్వ భూములకు కొత్త పట్టా పాస్ పుస్తకాలు ఇవ్వాలని డిమాండ్ చేస్తూ తెలంగాణ ప్రజా సంఘాల పోరాట కమిటీ ఆధ్వర్యంలో బుధవారం మెదక్, సంగారెడ్డి కలెక్టరేట్ ఎదుట ధర్నా నిర్వహించారు. అనంతరం తమ డిమాండ్లతో కూడిన వినతిపత్రాన్ని ఆఫీసర్లకు అందజేశారు. సంగారెడ్డిలో సీఐటీయూ రాష్ట్ర ఉపాధ్యక్షుడు మల్లికార్జున్, జిల్లా అధ్యక్షుడు బీ.మల్లేశం, ప్రధాన కార్యదర్శి సాయిలు, మెదక్​లో సీఐటీయూ జిల్లా కార్యదర్శి బస్వరాజ్, ఉపాధ్యక్షులు మల్లేశం, వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా కార్యదర్శి కే.మల్లేశం, కేవీపీఎస్ ​జిల్లా కార్యదర్శి సంగమేశ్వర్, ఎస్ఎఫ్ఐ జిల్లా అధ్యక్షుడు ప్రవీణ్, సహాయ కార్యదర్శి అజయ్, ఇతర ప్రజా సంఘాల నాయకులు పాల్గొన్నారు.

తెలంగాణ చేపలు విదేశాలకు ఎగుమతి

సిద్దిపేట, వెలుగు :  ఒకప్పుడు ఆంధ్ర ప్రాంతం నుంచి నుంచి చేపలను దిగుమతి చేసుకునే తెలంగాణ, ఇప్పుడు ఇక్కడి నుంచే విదేశాలకు ఎగుమతి చేసే దశకు గంగపుత్రులు ఎదగడం గర్వంగా ఉందని మంత్రి హరీశ్ ​రావు అన్నారు. బుధవారం సిద్దిపేటలోని కోమటి చెరువులో చేప పిల్లలను వదిలి మాట్లాడారు. కాళేశ్వరం ప్రాజక్టు నిర్మాణంతో రాష్ట్రంలోని అన్ని చెరువులు నీటితో కళకళలాడుతున్నాయన్నారు.  రాష్ట్ర వ్యాప్తంగా 120 కోట్ల చేప పిల్లలను చెరువుల్లో వదులుతున్నట్టు తెలిపారు. అంతకు ముందు సిద్దిపేట పట్టణంలోని మోహిన్ పురా ఆలయంలోని శ్రీవెంకటేశ్వర స్వామి బంగారు కిరీటి నమూనాను క్యాంపు కార్యాలయంలో పరిశీలించారు. వెంకన్న కిరీటం అద్భుతంగా ఉండేలా చూడాలని, దేవాలయ నిధులు, దాతలతో పాటు తాను కూడా ఈ కార్యక్రమానికి సహకరిస్తానని తెలిపారు. వచ్చే వైకుంఠ ఏకాదశి నాటికి బంగారు కిరీటాన్ని సిద్ధం చేయాలని ఆలయ అధికారులు, పాలక మండలికి సూచించారు. 

వైద్య విద్య బలోపేతానికి చర్యలు 

తెలంగాణ రాష్ట్రంలో వైద్య విద్య  బలోపేతానికి అవసరమైన అన్ని చర్యలను సీఎం కేసీఆర్ తీసుకుంటున్నారని మంత్రి హరీశ్​ రావు అన్నారు. బుధవారం రాత్రి సిద్దిపేట ప్రభుత్వ వైద్య కళాశాల వార్షికోత్సవానికి ఆయన హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఉమ్మడి రాష్ట్రంలో ప్రభుత్వ రంగంలో 840 సీట్లు ఉంటే,  ఏడేండ్ల కాలంలో 2840 సీట్లకు పెంచడంతో పాటు దేశంలో  33 జిల్లాల్లో ప్రభుత్వ వైద్య కళాశాలలను ఏర్పాటు చేసిన మొట్టమొదటి రాష్ట్రంగా తెలంగాణ నిలిచిందన్నారు.  సిద్దిపేట ప్రభుత్వ వైద్య కళాశాల విద్యార్థులు ఇటీవల నిర్వహించిన మెడ్ ఎక్స్ పో అద్భుతంగా ఉందని తెలిపారు. అంతకుముందు క్యాంపు ఆఫీస్​లో నిర్వహించిన కార్యక్రమంలో చిన్నకోడురు మండలం సలంద్రి గ్రామానికి చెందిన వివిధ పార్టీ లకు చెందిన 50 మంది యువకులు మంత్రి హరీశ్​రావు సమక్షంలో 
టీఆర్​ఎస్​లో చేరారు.

విద్యుత్​ శాఖ ఆఫీస్​లో ఆందోళన

మెదక్, వెలుగు : మెదక్  విద్యుత్​సర్కిల్ పరిధిలో నలుగురు జూనియర్ అకౌంట్స్ ఆఫీసర్లను ట్రాన్స్​ఫర్స్​​  చేసినా వారిని ఎందుకు రిలీవ్ చేయడం లేదంటూ బుధవారం తెలంగాణ రాష్ట్ర విద్యుత్ కార్మిక సంఘం (టీఆర్​వీకేఎస్​) ఆధ్వర్యంలో విద్యుత్​ శాఖ ఆఫీస్​లో ఎస్ఈ చాంబర్ ముందు ధర్నా చేశారు. టీఆర్​వీకేఎస్​ జిల్లా అధ్యక్షుడు ఉప్పర నర్సింగ్ మాట్లాడుతూ  ట్రాన్స్​ఫర్​ అయినా రిలీవ్​ చేయకపోవడానికి కారణమేంటో తెలుపాలని డిమాండ్​ చేశారు. ఈ విషయాన్ని విద్యుత్తు శాఖ, విజిలెన్స్​ అధికారుల దృష్టికి తీసుకెళ్తామన్నారు.  కార్యక్రమంలో టీఆర్​వీకేఎస్ ​సెక్రటరీ  సత్యనారాయణ, డివిజన్ సెక్రటరీ అశోక్, నాయకులు రత్నయ్య, రాజేశ్వరరావు, ప్రతాప్ రెడ్డి, శేఖర్ పాల్గొన్నారు. 

జోగిపేట ఏరియా ఆసుపత్రిని తనిఖీ చేసిన ఎమ్మెల్యే 

జోగిపేట, వెలుగు : జోగిపేటలోని ఏరియా ఆసుపత్రిని ఎమ్మెల్యే చంటి క్రాంతికిరణ్​ బుధవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. రోగులకు అందుతున్న సేవలపై ఆరా తీశారు. గతేడాది 92 వేల మంది రోగులు ఆసుపత్రికి రాగా, ఈ సంవత్సరం 9 నెలల్లోనే 78 వేల వరకు అవుట్‌‌‌‌ పేషెంట్లు వచ్చినట్లు సూపరింటెండెంట్‌‌‌‌ డాక్టర్‌‌‌‌ రమేశ్‌‌‌‌ వివరించారు. ప్రభుత్వం వైద్య, విద్యపై ప్రత్యేక దష్టి పెట్టడంతో ఆసుపత్రులపై ప్రజలకు, రోగులకు నమ్మకం ఏర్పడిందని ఎమ్మెల్యే అన్నారు. ఈ ఆసుపత్రిలో రోజురోజుకూ రోగుల సంఖ్య పెరుగుతుండడంతో ఇక్కడ 200 బెడ్‌‌‌‌ల హాస్పిటల్ అవసరమని తెలిపారు. ఈ విషయంతోపాటు, ఇతర సమస్యలను మంత్రి హరీశ్​ రావు దృష్టికి తీసుకువెళ్తానని చెప్పారు. ఆయన వెంట మున్సిపల్‌‌‌‌ చైర్మన్‌‌‌‌ గూడెం మల్లయ్య, వైస్‌‌‌‌ చైర్మన్‌‌‌‌ ప్రవీణ్‌‌‌‌ కుమార్, డాక్టర్లు రమేశ్, సంతోష్,  టీఆర్‌‌‌‌ఎస్‌‌‌‌ నాయకులు ఉన్నారు.  

ఇండ్లు ఇవ్వాలని బీజేపీ లీడర్ల దీక్ష

రామాయంపేట, వెలుగు:  దసరాలోపు అర్హులకు డబుల్ బెడ్​ రూమ్​ ఇండ్లు ఇవ్వాలని డిమాండ్ చేస్తూ బీజేపీ ఆధ్వర్యంలో బుధవారం రామాయంపేటలో ఒక్క రోజు నిరాహార దీక్ష చేపట్టారు. స్థానిక చౌరస్తాలో ఈ కార్యక్రమం చేపట్టగా పార్టీ జిల్లా అధ్యక్షుడు గడ్డం శ్రీనివాస్, పార్టీ లీడర్లకు పూల మాలలు వేసి దీక్షను ప్రారంభించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ రామాయంపేట మున్సిపల్  పరిధిలో 300 డబుల్​ బెడ్​ రూమ్ ఇండ్లు నిర్మించి చాలా రోజులవుతున్నా వాటిని కేటాయించకపోవడం సరికాదన్నారు. దసరా లోపు అర్హులకు ఇండ్లు కేటాయించకపోతే తామే అర్హులను ఇండ్లలోకి పంపుతామని స్పష్టం చేశారు. కార్యక్రమంలో పార్టీ రాష్ట్ర కార్యదర్శి నందు జనార్దన్ రెడ్డి, మండల ప్రెసిడెంట్ శివరాం, పట్టణ అధ్యక్షుడు శంకర్ గౌడ్,  మహిళా మోర్చా అధ్యక్షురాలు పోచమ్మల అశ్విని శ్రీనివాస్, చింతల శేఖర్ ఉన్నారు.

అర్హులందరికీ ఆసరా పింఛన్లు

నర్సాపూర్, వెలుగు : అర్హులందరికీ ఆసరా పింఛన్లు ఇస్తామని ఎమ్మెల్యే మదన్ రెడ్డి అన్నారు. బుధవారం నర్సాపూర్ మండలంలోని పెద్ద చింతకుంట, చిన్న చింతకుంట గ్రామాల్లో  సర్పంచులు గుండె శివకుమార్, బుర్ర సురేశ్​గౌడ్ ఆధ్వర్యంలో కొత్త ఆసరా పింఛన్ల కార్డులను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ప్రజా సంక్షేమమే ధ్యేయంగా ప్రభుత్వం పని చేస్తోందని తెలిపారు. కార్యక్రమంలో జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ చంద్ర గౌడ్, మార్కెట్ కమిటీ చైర్మన్ అనసూయ అశోక్ గౌడ్, ఆత్మ కమిటీ చైర్మన్ వెంకట్ రెడ్డి, టీఆర్​ఎస్​ నాయకులు పాల్గొన్నారు.

‘గీతం’లో ట్విన్నింగ్ బీఎస్సీ కోర్సు!

రామచంద్రాపురం (పటాన్​చెరు), వెలుగు:  పటాన్​చెరు పరిధిలోని గీతం డీమ్డ్​ యూనివర్సిటీ, బ్రిటన్​కు చెందిన నాటింగ్​ హామ్​ యూనివర్సిటీలు సంయుక్తంగా వచ్చే విద్యా సంవత్సరం నుంచి బీఎస్సీ ట్విన్నింగ్ కోర్సును ప్రవేశపెట్టనున్నాయి. గీతం స్కూల్​ ఆఫ్ సైన్స్​లో నాలుగేళ్ల బీఎస్సీ ఫుడ్​ సైన్స్​అండ్ టెక్నాలజీ కోర్సును నిర్వహించనున్నారు. ఈ మేరకు నాటింగ్​ హామ్​ రిలేషన్స్ అండ్ ప్రాజెక్ట్స్​ హెడ్​ అన్నే యిమెంగ్​ ఆన్​తో గీతం ప్రతినిధులు బుధవారం చర్చలు జరిపారు. స్కూల్​ఆఫ్​ సైన్స్ ప్రిన్సిపల్​ ప్రొఫెసర్​ దత్తాత్రి కే.నగేశ్​ మాట్లాడుతూ ఈ కోర్సులో చేరిన స్టూడెంట్స్ రెండేళ్ల పాటు గీతంలో, ఆ తరువాత బ్రిటన్​లో రెండేళ్లు చదువుతారని తెలిపారు. ముందుగా సెలబస్, బ్రిడ్జ్​కోర్సుల ఖరారు, తర్వాత ఎంఓయూ చేసుకోవాలని చర్చించినట్లు చెప్పారు. ఇలాగే 2019 నుంచి ఆస్ర్టేలియాలోని మెల్​బోర్న్​ యూనివర్శిటీతో కలిసి గీతం బీఎస్సీ బ్లెండెడ్​ కోర్సును నిర్వహిస్తోందని, వచ్చే ఏడాది నుంచి బ్రిటన్ నాటింగ్​ హామ్​తో కూడా కోర్సు మొదలవుతుందని తెలిపారు. ఈ మీటింగ్​లో ఫుడ్​ సైన్స్ ప్రొఫెసర్​ ఉమా మహేశ్వరి, డాక్టర్ అజయ్​ కుమార్​స్వర్ణాకర్, మౌమితా దేవ్, జీ.నిహారిక, పరుల్​థాపర్, ఈఈసీఈ ప్రొఫెసర్ పీ.త్రినాథరావు 
పాల్గొన్నారు. 

అనర్హులకు ఇండ్లు ఇస్తున్నారని ఎమ్మెల్యేకు ఫిర్యాదు

దుబ్బాక, వెలుగు: అనర్హులకు డబుల్ ​బెడ్ ​రూమ్​ఇండ్లు ఇస్తున్నారని దుబ్బాక మండల పరిధిలోని పోతారం గ్రామానికి చెందిన 50 మంది నిరుపేద కుటుంబాల సభ్యులు బుధవారం దుబ్బాకలో ఎమ్మెల్యేను కలిసి ఫిర్యాదు చేశారు. అర్హులకు ఇండ్లు ఇవ్వాలని ఇటీవల గ్రామంలో ర్యాలీ తీసి, దుబ్బాక-–కొత్తపల్లి రోడ్డుపై బైఠాయించి నిరసన తెలిపినందున తమపై స్థానిక లీడర్లు దొంగతనం కేసు పెట్టించారని ఎమ్మెల్యేకు తెలిపారు. వెంటనే ఎమ్మెల్యే సంబంధిత పోలీస్​ ఆఫీసర్లతో ఫోన్​లో మాట్లాడారు.  గ్రామంలో డబుల్​ బెడ్​ రూమ్ ​ఇండ్లను అలాట్​ చేయకముందే, అందులో ఎవరూ నివాసం ఉండకుండానే దొంగతనం ఎలా జరుగుతుందని పోలీస్​లను నిలదీశారు. తానే స్వయంగా గ్రామంలోకి వచ్చి అర్హులకే ఇండ్లు వచ్చే విధంగా చర్యలు తీసుకుంటానని బాధితులకు ఆయన హామీ ఇచ్చారు. ఎమ్మెల్యేను కలిసిన వారిలో సంగారెడ్డి మల్లేశం, ఎర్రోళ్ల రమేశ్, శ్రీనివాస్​ గౌడ్​, సుద్దాల రాజు, నర్సింలు ఉన్నారు.

తెలంగాణ చేపలు విదేశాలకు ఎగుమతి

సిద్దిపేట, వెలుగు :  ఒకప్పుడు ఆంధ్ర ప్రాంతం నుంచి నుంచి చేపలను దిగుమతి చేసుకునే తెలంగాణ, ఇప్పుడు ఇక్కడి నుంచే విదేశాలకు ఎగుమతి చేసే దశకు గంగపుత్రులు ఎదగడం గర్వంగా ఉందని మంత్రి హరీశ్ ​రావు అన్నారు. బుధవారం సిద్దిపేటలోని కోమటి చెరువులో చేప పిల్లలను వదిలి మాట్లాడారు. కాళేశ్వరం ప్రాజక్టు నిర్మాణంతో రాష్ట్రంలోని అన్ని చెరువులు నీటితో కళకళలాడుతున్నాయన్నారు.  రాష్ట్ర వ్యాప్తంగా 120 కోట్ల చేప పిల్లలను చెరువుల్లో వదులుతున్నట్టు తెలిపారు. అంతకు ముందు సిద్దిపేట పట్టణంలోని మోహిన్ పురా ఆలయంలోని శ్రీవెంకటేశ్వర స్వామి బంగారు కిరీటి నమూనాను క్యాంపు కార్యాలయంలో పరిశీలించారు. వెంకన్న కిరీటం అద్భుతంగా ఉండేలా చూడాలని, దేవాలయ నిధులు, దాతలతో పాటు తాను కూడా ఈ కార్యక్రమానికి సహకరిస్తానని తెలిపారు. వచ్చే వైకుంఠ ఏకాదశి నాటికి బంగారు కిరీటాన్ని సిద్ధం చేయాలని ఆలయ అధికారులు, పాలక మండలికి సూచించారు. 

వైద్య విద్య బలోపేతానికి చర్యలు 

తెలంగాణ రాష్ట్రంలో వైద్య విద్య  బలోపేతానికి అవసరమైన అన్ని చర్యలను సీఎం కేసీఆర్ తీసుకుంటున్నారని మంత్రి హరీశ్​ రావు అన్నారు. బుధవారం రాత్రి సిద్దిపేట ప్రభుత్వ వైద్య కళాశాల వార్షికోత్సవానికి ఆయన హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఉమ్మడి రాష్ట్రంలో ప్రభుత్వ రంగంలో 840 సీట్లు ఉంటే,  ఏడేండ్ల కాలంలో 2840 సీట్లకు పెంచడంతో పాటు దేశంలో  33 జిల్లాల్లో ప్రభుత్వ వైద్య కళాశాలలను ఏర్పాటు చేసిన మొట్టమొదటి రాష్ట్రంగా తెలంగాణ నిలిచిందన్నారు.  సిద్దిపేట ప్రభుత్వ వైద్య కళాశాల విద్యార్థులు ఇటీవల నిర్వహించిన మెడ్ ఎక్స్ పో అద్భుతంగా ఉందని తెలిపారు. అంతకుముందు క్యాంపు ఆఫీస్​లో నిర్వహించిన కార్యక్రమంలో చిన్నకోడురు మండలం సలంద్రి గ్రామానికి చెందిన వివిధ పార్టీ లకు చెందిన 50 మంది యువకులు మంత్రి హరీశ్​రావు సమక్షంలో టీఆర్​ఎస్​లో చేరారు.