ఉమ్మడి మెదక్ జిల్లా సంక్షిప్త వార్తలు

ఉమ్మడి మెదక్ జిల్లా సంక్షిప్త వార్తలు

సిద్దిపేట, వెలుగు: పేదల కోసమే రాష్ట్ర ప్రభుత్వం డబుల్​ బెడ్రూం ఇండ్లను నిర్మించి ఇస్తోందని మంత్రి హరీశ్​రావు అన్నారు. సోమవారం సిద్దిపేట మున్సిపాల్టీ పరిధిలోని పలు అభివృద్ధి పనుల ప్రారంభం, శంకుస్థాపనలు చేశారు. ఈ సందర్భంగా మంత్రి హరీశ్​రావు మాట్లాడుతూ దేశంలోనే పేద ప్రజలకు గృహా సముదాయం కేవలం సిద్ధిపేటలోనే ఉందని, ప్రజా అవసరాలకు అనుగుణంగా ఆదర్శ కాలనీగా తీర్చిదిద్దేందుకు టీఆర్ఎస్ సర్కారు కృషి చేస్తోందన్నారు. అనంతరం సిద్ధిపేట కేసీఆర్ నగర్ లో 33/11 కేవీ విద్యుత్తు ఉప కేంద్రం, కేసీఆర్ నగర్ లో  పోచమ్మ దేవాలయ  కాంపౌండ్ వాల్,  మంచినీటి ట్యాంక్ పనులకు శంకుస్థాపన చేశారు.  పోలీసు ఔట్ పోస్ట్ ను ప్రారంభించారు. 

తహసీల్​ ఆఫీసు ప్రారంభం  

కొత్తగా ఏర్పాటైన కుకునూరుపల్లి తహసీల్​ఆఫీసును మంత్రి హరీశ్​ రావు ప్రారంభించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో మంత్రి మాట్లాడుతూ 30 ఏళ్ల కల కుకునూరుపల్లి మండల ఏర్పాటు సీఎం కేసీఆర్ నేతృత్వంలో సాకారమైందన్నారు. ఎండాకాలం వస్తే కుకునూరుపల్లి లో  నీటి యుద్ధాలు జరిగేవని, కాంగ్రెస్, టీడీపీలు గెలిచినా ఎవరు ఈ సమస్యను పరిష్కరించలేదని,  కేసీఆర్ వల్లే  తాగునీటి సమస్య దూరమైందన్నారు. కార్యక్రమంలో ఎంపీ కొత్త ప్రభాకర్​రెడ్డి, కలెక్టర్ ప్రశాంత్ జీవన్ పాటిల్, జడ్పీ చైర్మన్ రోజా శర్మ, ఎఫ్ డీసీ చైర్మన్​ ప్రతాపరెడ్డి పాల్గొన్నారు. అంతకు ముందు  సిద్దిపేట వేమువాడ కమాన్ వద్ద   జరుగుతున్న ఆయుత చండీయాగం లో  మంత్రి హరీష్ రావు పాల్గొని ప్రత్యేక పూజలు చేశారు.   ఈ సందర్భంగా కృష్ణ జ్యోతి స్వరూపానంద స్వామి ఆశీస్సులు తీసుకున్నారు. 

టీఆర్ఎస్ లో చేరిక

మిట్టపల్లి ఆర్చ్ ఫార్మా కార్మికులు పలువురు మంత్రి హరీశ్​ రావు సమక్షంలో టీఆర్ఎస్ లో చేరారు. క్యాంపు ఆఫీసులో నిర్వహించిన కార్యక్రమంలో మంత్రి పలువురికి కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. 

సమస్యల పరిష్కారానికి ప్రాధాన్యమివ్వాలి 

సంగారెడ్డి టౌన్, వెలుగు: ప్రజావాణిలో వచ్చిన దరఖాస్తులను పరిశీలించి సమస్యలను  పరిష్కరించాలని సంగారెడ్డి కలెక్టర్ డాక్టర్ శరత్ పేర్కొన్నారు.  సోమవారం కలెక్టరేట్​లో నిర్వహించిన ప్రజావాణిలో అర్జీదారుల నుంచి అర్జీలు స్వీకరించారు. ప్రజావాణిలో 35 అర్జీలు వచ్చాయని, వాటిలో ఆసరా పింఛన్లు, భూ సర్వే, డబుల్ బెడ్ రూమ్ ఇండ్లు, తదితరాలపై ఎక్కువగా ఫిర్యాదులు వచ్చినట్లు కలెక్టర్​చెప్పారు. కార్యక్రమంలో అదనపు కలెక్టర్లు రాజర్షి షా, వీరారెడ్డి, జిల్లా అధికారులు, పాల్గొన్నారు.

మెదక్​ టౌన్​, వెలుగు : మెదక్​కలెక్టరేట్ లో సోమవారం నిర్వహించిన ప్రజావాణికి 63 దరఖాస్తులు వచ్చాయి. వీటిని అడిషనల్​ కలెక్టర్ రమేశ్​మాట్లాడుతూ సమస్యల పరిష్కారంలో అధికారులు నిబద్ధతతో పనిచేయాలన్నారు. కార్యక్రమంలో డీఆర్​డీవో శ్రీనివాస్​, ఎక్సైజ్​సూపరింటెండెంట్​రజాక్​, డీఎస్​వో శ్రీనివాస్​ పాల్గొన్నారు.

సమస్యలపై 100 అర్జీలు

సిద్దిపేట రూరల్, వెలుగు: సిద్దిపేట కలెక్టరేట్​లో సోమవారం ప్రజావాణి నిర్వహించారు. వివిధ సమస్యలపై 100 అర్జీలు వచ్చినట్లు అడిషనల్ కలెక్టర్ శ్రీనివాస్ రెడ్డి తెలిపారు. కార్యక్రమంలో డీఆర్డీవో గోపాల్ రావు, కలెక్టరేట్ ఏవో అబ్దుల్ రహమాన్ పాల్గొన్నారు.

బాధితులకు న్యాయం జరిగేలా చూడాలి

మెదక్​ టౌన్​, వెలుగు: పోలీస్​స్టేషన్లకు ఆయా సమస్యలపై వచ్చే బాధితులకు న్యాయం జరిగేలా ఆయా పోలీస్​స్టేషన్ల ఎస్​హెచ్​వోలు చూడాలని ఎస్పీ రోహిణి ప్రియదర్శిని అన్నారు. సోమవారం ఎస్పీ ఆఫీసులో పోలీస్​ ప్రజావాణి నిర్వహించారు. 

 

బండి పాదయాత్ర అడ్డుకోవడం సరికాదు 


సంగారెడ్డి టౌన్, వెలుగు: బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ కుమార్ చేపట్టిన ప్రజాసంగ్రామ యాత్రను అడ్డుకోవడం సిగ్గుచేటని సంగారెడ్డి నియోజకవర్గ కన్వీనర్ పోచారం రాములు ఆరోపించారు. సోమవారం సంగారెడ్డి లోని పార్టీ ఆఫీసులో మీడియాతో మాట్లాడుతూ పాదయాత్రకు అనుమతి లేదని చెప్పి, బండి సంజయ్​ను పోలీసులు అడ్డుకోవడం సరికాదన్నారు. జిల్లా పర్యటనలు చేస్తూ క్షేత్రస్థాయిలో ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను తెలుసుకోవడానికే ప్రజా సంగ్రామ యాత్ర చేపట్టినట్లు చెప్పారు. సమావేశంలో ఓబీసీ మోర్చా రాష్ట్ర కార్యదర్శి సురేందర్, 21వ వార్డు కౌన్సిలర్ నాగరాజు, జిల్లా నాయకులు వెంకట నరసింహారెడ్డి, పాపయ్య, సూర్య నాయక్ ,హర్షవర్ధన్ రెడ్డి  పాల్గొన్నారు. 

 

వైద్యానికి పెద్దపీట వేస్తున్న సీఎం


మెదక్​ టౌన్​, వెలుగు: మెరుగైన వైద్య  సదుపాయాలతోనే ఆరోగ్యకరమైన సమాజం ఏర్పడుతుందని, సీఎం కేసీఆర్​ వైద్యరంగానికి అత్యంత ప్రాధాన్యమిస్తున్నారని మెదక్​ ఎమ్మెల్యే పద్మా దేవేందర్​రెడ్డి అన్నారు. సోమవారం మెదక్​ పట్టణంలోని మాతా శిశు  సంరక్షణ హాస్పిటల్​లో ఏర్పాటు చేసిన టిఫా స్కానింగ్ మిషన్​ను ఆమె ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ప్రభుత్వం ఆధునిక వైద్య పరికరాలు, మౌలిక వసతులు కల్పించడంతోపాటు వైద్య సిబ్బందిని నియమిస్తోందన్నారు. కార్పొరేట్ స్థాయిలో సర్కారు దవాఖానాలను తీర్చిదిద్ది అత్యున్నత స్థాయిలో వైద్య సేవలను ఉచితంగా అందిస్తోందన్నారు.  అనంతరం ఎమ్మెల్యే వార్డులను పరిశీలించారు. చిన్నపిల్లలను ఎత్తుకుని వారి ఆరోగ్యంపై తల్లులను ఆరా తీశారు. కార్యక్రమంలో మెదక్ మున్సిపల్ చైర్మన్ చంద్రపాల్, మార్కెట్ కమిటీ చైర్మన్ జగపతి,  జిల్లా హాస్పిటల్​సూపరింటెండెంట్ చంద్రశేఖర్​, మున్సిపల్ వైస్ చైర్మన్ మల్లికార్జున గౌడ్,  కౌన్సిలర్లు, టీఆర్ఎస్​లీడర్లు పాల్గొన్నారు.
 

యువతకు ఉపాధి కల్పించేందుకు కృషి

మెదక్​ టౌన్​, వెలుగు : మెదక్​ జిల్లా వ్యాప్తంగా వివిధ రంగాల్లో శిక్షణ పొందిన యువతకు ఉపాధి కల్పించేందుకు కృషి చేస్తామని మెదక్​ ఎమ్మెల్యే పద్మా దేవేందర్​రెడ్డి అన్నారు.  సోమవారం మెదక్​లోని గవర్నమెంట్​ గర్ల్స్​ హైస్కూల్​ భవనంలో ఏర్పాటు చేసిన వృత్తి నైపుణ్య  శిక్షణా కేంద్రంలో వివిధ వృత్తుల్లో శిక్షణ పొందిన 81 మందికి సర్టిఫికెట్లను అందజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. శిక్షణ పొందిన యువత  తమ కాళ్లపై తాము నిలబడాలని, ప్రభుత్వ పరంగా తగు సహాయ సహాకారాలు అందిస్తామని అన్నారు. కార్యక్రమంలో జిల్లా యువజన, క్రీడల అధికారి నాగరాజు, మున్సిపల్​ చైర్మన్​చంద్రపాల్, వైస్ చైర్మన్​మల్లికార్జున్ గౌడ్, మార్కెట్ కమిటీ చైర్మన్​జగపతి, కౌన్సిలర్లు కృష్ణారెడ్డి,  జయరాజ్  తదితరులు 
పాల్గొన్నారు.


తెలంగాణ ఫార్మా ఎడిటర్ గా సంతోష్

సంగారెడ్డి టౌన్, వెలుగు: ‘తెలంగాణ ఫార్మా’ ఎడిటర్ గా సంగారెడ్డి పట్టణానికి చెందిన అనుముల సంతోష్ కుమార్ ను నియమించారు. కెమిస్ట్ అండ్ డ్రగ్గిస్ట్ అసోసియేషన్ జిల్లా ట్రెజరర్​గా పనిచేస్తున్న సంతోష్ సేవలను గుర్తించి రాష్ట్రస్థాయిలో చోటు కల్పించారు. ఈ సందర్భంగా సంతోష్ మాట్లాడుతూ కెమిస్ట్రీల అభివృద్ధి, సంక్షేమం కోసం కృషి చేస్తానన్నారు. 


మెదక్​లో సీఎం కేసీఆర్​ దిష్టిబొమ్మ దహనం


మెదక్​ టౌన్​, వెలుగు:  రాష్ట్రంలో పాదయాత్ర చేస్తున్న వైఎస్ఆర్టీపీ చీఫ్​ వైఎస్​ షర్మిల బస్సును దహనం చేయడం దారుణమని ఆ పార్టీ జిల్లా అధ్యక్షుడు వనపర్తి వెంకటేశం అన్నారు. ఈ ఘటనను ఖండిస్తూ మెదక్​ పట్టణంలోని రాందాస్​ చౌరస్తాలో సీఎం కేసీఆర్ దిష్టిబొమ్మను దహనం చేశారు. ఈ సందర్భంగా వెంకటేశం మాట్లాడుతూ... రాష్ట్రంలో పాదయాత్ర చేస్తూ సీఎం కేసీఆర్​ ప్రజా వ్యతిరేక కార్యక్రమాలను ప్రశ్నిస్తున్నందుకు తట్టుకోలేకనే షర్మిల బస్సుపై ఎమ్మెల్యే అనుచరులు దాడి చేశారని దుయ్యబట్టారు. కార్యక్రమంలో జిల్లా యువజన సంఘం అధ్యక్షుడు  రోహిత్ కుమార్, లీడర్లు నరేశ్, చందు, అభిలాష్,  గోపీ,  భాను, రాఖీ, సూర్య, అఖిల్, మహేశ్, ఫక్రుద్దీన్​ తదితరులు పాల్గొన్నారు.