
హైదరాబాద్, వెలుగు : తెలుగు రాష్ట్రాల మధ్య కృష్ణా జలాల వివాదాన్ని పరిష్కరించేందుకు ఏర్పాటు చేసిన బ్రిజేశ్ కుమార్ ట్రిబ్యునల్ విచారణ వాయిదా పడింది. బుధవారం నుంచి శుక్రవారం వరకు విచారణ జరగాల్సి ఉండగా, ట్రిబ్యునల్ సభ్యుడు జస్టిస్ రామ్మోహన్ రెడ్డి అందుబాటులో లేకపోవడంతో వాయిదా పడింది. ఈ విషయాన్ని జస్టిస్ బ్రిజేశ్ కుమార్ మంగళవారం వెల్లడించారు.విచారణ ఎప్పుడు ప్రారంభమయ్యేది త్వరలోనే వెల్లడిస్తామని పేర్కొన్నారు.