లాక్ డౌన్ కఠినంగా అమలు చేయాలని చెప్పి….తను చేసిందెంటో తెలుసా!

లాక్ డౌన్ కఠినంగా అమలు చేయాలని చెప్పి….తను చేసిందెంటో తెలుసా!
  • గర్ల్ ఫ్రెండ్ కోసం నిబంధనల ఉల్లంఘన
  • బ్రిటన్ గవర్నమెంట్ సైంటిస్ట్ నిర్వాకం
    లండన్ : బ్రిటన్ గవర్నమెంట్ లో కీలకమైన సైంటిస్ట్ తను. అంటు వ్యాధుల నివారణలో ఎక్స్ ఫర్ట్. దేశంలో కరోనా ఎఫెక్ట్ ను తగ్గించాలంటే లాక్ డౌన్ ఒక్కటే మార్గమని చెప్పిన వ్యక్తే తను. ఆయన ఇచ్చిన సూచనల మేరకే బ్రిటన్ ప్రైమ్ మినిస్టర్ బోరిస్ జాన్సన్ దేశంలో కఠినంగా లాక్ డౌన్ అమలు చేస్తున్నారు. అలాంటప్పుడు ఆ సైంటిస్ట్ ఇంకా ఎంతో బాధ్యతగా ఉండాలి. కానీ చెప్పేందుకే నీతులు…అన్నట్లు లాక్ డౌన్ కఠినంగా అమలు చేయాలంటూ సూచించిన తానే నిబంధనలను ఉల్లంఘించాడు. ఆయన పేరు ఫ్రొఫెసర్ నీల్ ఫెర్గ్యూసన్. గర్ల్ ఫ్రెండ్ కోసం నిబంధనలు ఉల్లంఘించి ఆ మహిళను తన ఇంటికి పిలిపించుకున్నాడు. దీనిపై బ్రిటన్ లో దుమారం రేగింది. ఫెర్గ్యూసన్ తీరుపై పలువురు తీవ్ర విమర్శలు చేయటంతో ఆయన సైంటిఫిక్ గ్రూప్ ఫర్ ఎమర్జెన్సీ నుంచి తప్పుకున్నారు. తన గర్ల్ ఫ్రెండ్ ను రెండు సార్లు ఇంటికి అనుమతించినట్లు అంగీకరించారు. తాను చేసింది తప్పేనంటూ పదవికి రిజైన్ చేశారు. ఐతే కరోనా నివారణకు కచ్చితంగా ఫిజికల్ డిస్టెన్స్ మెయింటెన్ చేయాలని ఆయన సూచించారు.