బిస్కెట్ కంపెనీ బంపర్ ఆఫర్.. ఒకరోజు ఇంటర్నిషిప్..రూ.3లక్షల స్టైఫండ్

బిస్కెట్ కంపెనీ బంపర్ ఆఫర్.. ఒకరోజు ఇంటర్నిషిప్..రూ.3లక్షల స్టైఫండ్

డబ్బు సంపాదించాలనుకుంటున్నారా.. ఎఫర్ట్ లెస్ మార్గాలను వెతుకుతున్నారా.. అయితే మీకో గోల్డెన్ ఆఫర్.. ఒక పదం ఉచ్ఛారణ ను సరిచేయగలిగితే చాలు.. అంటే సరైన ఉచ్ఛారణ నైపుణ్యం సాధించగలిగితే మీరు లక్షాధికారి కావొచ్చు.. అదీ..నెలలోనో, సంవత్సరాల్లోనో కాదు.. కేవలం ఒకరోజులో.. ఇది ఎలా సాధ్యం అనుకుంటున్నారా.. సాధ్యమే.. ప్రముఖ ఫుడ్ ప్రాడక్ట్ కంపెనీ బ్రిటానియా అందిస్తున్న గొప్ప ఆఫర్.. ఈ ఆఫర్ గురించి పూర్తి వివరాలు తెలుసుకుందాం రండి.. 

ప్రముఖ ఫుడ్ ప్రాడక్ట్ సంస్థ బ్రిటానియా క్రోయిసెంట్ ఉచ్ఛారణ నిపుణుడు కోసం వెతుకుతోంది. అద్భుతమైన ఇంటర్న్ షిప్ అవకాశాన్ని అందిస్తోంది. కేవలం ఒక రోజుకు రూ. 3లక్షల విలువైన ప్రత్యేకమైన ఇంటర్న్ షిప్ ను ప్రకటించింది.  ఇందులో కంటెస్టెంట్ చేయాల్సిన పనేంటంటే.. రోజంతా బ్రిటానియా ఆఫీసులో ప్రతీసెక్షన్ తిరుగుతూ. ఉద్యోగుల్లో ఎవరైతే క్రోయిసెంట్ అనే పదాన్ని తప్పుగా పలుకుతారో వారిని గుర్తించి సరిచేయడమే.. చాలా చమత్కారమైన ఇంటర్నిషప్ కదా.. 

భారతదేశంలో క్రోయిసెంట్ లను విస్తృతంగా వినియోగిస్తూ వాటి రుచిని ఆస్వాదిస్తున్నా.. ఫ్రెంచ్ భాషనుంచి వచ్చి ఈ పదాన్ని చాలా మంది ఉద్యోగులు సరిగ్గా ఉచ్ఛరించడం లేదని కంపెనీ ఆందోళన పడుతోంది. దీనిని భాషపరమైన సవాల్ అని అంటోంది. దీనికోసం బ్రిటానియా క్రోయిసెంట్ వాయిస్ గా మారండి.. మా కార్యాలయంలో క్రోసెంట్ అని తప్పుగా ఉచ్ఛరించే వ్యక్తులను సరిదిద్దండి అని స్లోగన్ కూడా ఏర్పాటు చేశారు.

ఎలా అప్లయ్ చేసుకోవాలి..   

మాకు 18 సంవత్సరాలు అంతకంటే ఎక్కువ వయస్సు ఉన్నట్లయితే ఈ ప్రత్యేకమైన ఇంటర్న్షిప్ కోసం దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు. మీరు భాషాభిమానులై ఉండాలి..బ్రిటానియా పేస్ట్రీలను ఎక్కువ ఇష్టపడేవారై ఉండాలి. బ్రిటానియా ఇంటర్న్ షిప్ .. ఆడా, మగ తేడా లేకుండా అన్ని వర్గాల వారికి అందుబాటులో ఉంటుంది.  

మీరు చేయాల్సిందల్లా.. బ్రిటానియా వాట్సాప్ ఛానెల్ లో నమోదు చేసుకోవడమే..వాట్సాప్ ఛానెల్ ప్రాధమిక ప్రశ్నలకు జవాబు ఇచ్చిన తర్వాత ఇన్ స్టాగ్రామ్ లో రెండు ముఖ్యమైన పనులు చేయాల్సి ఉంటుంది. ముందుగా బ్రిటానియా క్రోయిసెంట్ కు చెందిన ఇన్ స్టాగ్రామ్ అనుసరించాలి. తర్వాత నియామక పోస్ట్ కి వెళ్లి మీ వివరాలను షేర్ చేయాలి అంతే.. 

ఈ వింతైన ఇంటర్న షిప్ కోసం రివార్డు రూ. 3లక్షల స్టైఫండ్. ఈ ప్రత్యేకమైన ఇంటర్న్ షిప్ ఒకరోజు మాత్రమే ఉంటుంది.  ఈ సదావకాశాన్ని పొందాలంటే మీ దరఖాస్తుచేసుకోవడానకి చివరి తేది మార్చి 10 2024 ..హర్రీ అప్..