
Suzlon Energy Shares: మల్టీబ్యాగర్ స్టాక్ అనగానే చాలా మంది చిన్న పెట్టుబడిదారులకు గుర్తొచ్చే స్టాక్ సుజ్లాన్ ఎనర్జీ. ప్రస్తుతం ప్రపంచ వ్యాప్తంగా గ్రీన్ ఎనర్జీకి పెరుగుతున్న డిమాండ్ కారణంగా విండ్ సోలార్ స్టాక్స్ పెరుగుతున్న సంగతి తెలిసిందే.
నేడు ఇంట్రాడే ట్రేడింగ్ సమయంలో స్వల్పంగా పెరిగిన సుజ్లాన్ స్టాక్ ధర దాదాపు రూ.65 వద్ద ట్రేడింగ్ కొనసాగిస్తోంది. ప్రస్తుతం కంపెనీ షేర్లపై కొన్ని బ్రోకరేజ్ సంస్థలు సానుకూలతను వ్యక్తం చేస్తున్నాయి. ముందుగా గ్లోబల్ బ్రోకరేజ్ సంస్థ యూబీఎస్ స్టాక్ 20 శాతం పెరగవచ్చని అంచనాలను పంచుకుంటూ బై రేటింగ్ అందించింది. దీంతో స్టాక్ టార్గెట్ ధరను రూ.78గా ఫిక్స్ చేసింది. ఇదే క్రమంలో మరో సంస్థ మోర్గన్ స్టాన్లీ కూడా కంపెనీ షేర్లపై సానుకూలతను వ్యక్తం చేస్తూ ఓవర్ వెయిట్ రేటింగ్ ఇచ్చింది. దీంతో టార్గె్ట్ ధరను రూ.77గా ప్రకటించింది. ఇక చివరిగా మోతీలాల్ ఓస్వాల్ సుజ్లాన్ షేర్ల టార్గెట్ ధరను రూ.82 వద్ద ఫిక్స్ చేసింది.
విండ్ ఎనర్జీ స్థానికీకరణ గురించి న్యూ అండ్ రెన్యూవబుల్ ఎనర్జీ మంత్రిత్వ శాఖ కొత్త మార్గదర్శకాలను తీసుకురావటంపై బ్రోకరేజ్ సంస్థలు బులిష్ గా ఉన్నాయి. అలాగే రానున్న రెండు ఆర్థిక సంవత్సరాల్లో కంపెనీ ఆదాయం కూడా 40 శాతం పెరగవచ్చని అవి అంచనా వేశాయి. అలాగే ప్రస్తుతం మార్కెట్లో మరిన్ని కొత్త ఆర్డర్లు వచ్చే అవకాశం ఉండటంపై కూడా బ్రోకరేజ్ సంస్థలు సానుకూలతను వ్యక్తం చేస్తున్నాయి.
NOTE: పైన అందించిన వివరాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. వీటి ఆధారంగా ఎలాంటి పెట్టుబడి నిర్ణయాలు తీసుకోకండి. స్టాక్ మార్కెట్లు, మ్యూచువల్ ఫండ్స్, క్రిప్టోల్లో పెట్టుబడులు నష్టాలతో కూడుకున్నవి. ఏదైనా పెట్టుబడి నిర్ణయం తీసుకోవటానికి ముందుగా మీ ఆర్థిక సలహాదారులను సంప్రదించటం ఉత్తమం. మీరు తీసుకునే నిర్ణయాలకు V6 యాజమాన్యం లేదా ఉద్యోగులు ఎట్టిపరిస్థితుల్లోనూ బాధ్యత వహించరు.