నిజామాబాద్ పార్లమెంట్ బీఆర్ఎస్ అభ్యర్థి బాజిరెడ్డి గోవర్ధన్ ఎన్నికల ప్రచారంలో భాగంగా జగిత్యాల పట్టణంలోని ఓ ఫంక్షన్ హాల్లో ముఖ్య నాయకుల, కార్యకర్తల సమావేశం జరిగింది. అయితే సమావేశం మధ్యలోనే కార్యకర్తలు వెళ్లిపోవడం గమనార్హం. మధ్యాహ్నం 12 గంటలకు నిర్వహించాల్సిన సమావేశం...ఆలస్యంగా ప్రారంభం కావడంతో కార్యకర్తలు అప్పటికే నిరాసించిపోయారు. దీంతో భోజనాలు తినేసి వెళ్లిపోయారు. ఇక సమావేశానికి వచ్చిన మిగతా వాళ్లు బయటకు వెళ్లకుండా ఫంక్షన్ హాల్ గేట్ కు తాళం వేశారు ఆ పార్టీ నాయకులు. తాళం వేయడం పట్ల కార్యకర్తల తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. వెంటనే తాళం తెరవాలంటూ ఆందోళనలు చేశారు. కార్యకర్తల ఆందోళనతో ఫంక్షన్ హాల్ నిర్వాహకులు తాళం తీశారు.
