
చేర్యాల, వెలుగు: జనగామ డీసీసీ అధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్యే కొమ్మూరి ప్రతాపరెడ్డి సమక్షంలో బీఆర్ఎస్, బీజేపీల నుంచి భారీ సంఖ్యలో నాయకులు, కార్యకర్తలు కాంగ్రెస్ పార్టీలో చేరారు. సోమవారం మండల కేంద్రంలోని కొమ్మూరి క్యాంప్ ఆఫీస్లో పార్టీ పట్టణాధ్యక్షుడు దాసరి శ్రీకాంత్, చేర్యాల 10 వ వార్డు ఇన్చార్జి చింతల మల్లేశం ఆధ్వర్యంలో వారు కాంగ్రెస్ లో చేరగా, కొమ్మూరి పార్టీ కండువాలు కప్పి ఆహ్వానించారు. అనంతరం కొమ్మూరి మాట్లాడుతూ స్థానిక సంస్థల ఎన్నికల్లో చేర్యాల సబ్ డివిజన్లో కాంగ్రెస్ పార్టీ ఖచ్చితంగా విజయం సాధిస్తుందని జోస్యం చెప్పారు.
కార్యక్రమంలో బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు మంజ మల్లేశం, చంద్రయ్య, లక్ష్మీనారాయణ, నరేందర్, సతీశ్, రాకేశ్ కృష్ణన్, అందె నాని, నీలం సన్నీ, సదానందం, ఖలీం పాష, అరవింద్, హరీశ్, భాను, ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.