చిలుకానగర్​లో బండారి లక్ష్మారెడ్డి పాదయాత్ర

చిలుకానగర్​లో బండారి లక్ష్మారెడ్డి పాదయాత్ర

ఉప్పల్, వెలుగు: ఎన్నికల ప్రచారంలో భాగంగా ఉప్పల్ సెగ్మెంట్ పరిధి చిలుకానగర్ డివిజన్ పద్మావతి కాలనీలో బీఆర్ఎస్ అభ్యర్థి బండారి లక్ష్మారెడ్డి శనివారం పాదయాత్ర చేపట్టారు. ఆయన వెంట బీఆర్ఎస్ నేత రాగిడి లక్ష్మారెడ్డి,   కార్పొరేటర్ బన్నాల గీత, డివిజన్ అధ్యక్షులు, ప్రధాన కార్యదర్శులు, సీనియర్ నేతలు ఉన్నారు. 

పాదయాత్రలో లక్ష్మారెడ్డికి జనం ఘన స్వాగతం పలికారు. మహిళలు మంగళహారతులు పట్టారు. అనంతరం ఆయన ఇంటింటికి తిరుగుతూ ప్రచారం నిర్వహించారు. కారు గుర్తుకు ఓటేసి తనను గెలిపించాలని కోరారు.