మార్పును గమనించి ఓటెయ్యాలి : సునీత లక్ష్మారెడ్డి

మార్పును గమనించి ఓటెయ్యాలి : సునీత లక్ష్మారెడ్డి

నర్సాపూర్ (హత్నూర), వెలుగు :  తెలంగాణ అభివృద్ధి కోసం కారు గుర్తుకు ఓటేసి తోడ్పాటునందించాలని బీఆర్ఎస్ అభ్యర్థి సునీత లక్ష్మారెడ్డి కోరారు. సోమవారం ఆమె ఎమ్మెల్యే మదన్‌రెడ్డి, అసంఘటిత కార్మిక సంక్షేమ సంఘం చైర్మన్‌ దేవేందర్‌రెడ్డితో కలిసి మండల పరిధిలోని దేవుని గుట్ట తండా, తెల్లరాళ్ల తండా,  సిరిపురం, గోవిందరాజ్ పల్లి, పన్యాల గ్రామాల్లో ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ..తెలంగాణ రాకముందు, తెలంగాణ వచ్చిన తర్వాత మార్పును గమనించి ప్రజలు ఓటెయ్యాలన్నారు.

మరొకసారి తనను లక్ష మెజారిటీతో గెలిపించాల్సిందిగా కోరారు. కార్యక్రమంలో బీఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షుడు శ్రీనివాసరెడ్డి, ఎంపీటీసీల ఫోరం అధ్యక్షుడు రాజేందర్, సర్పంచుల ఫోరం అధ్యక్షుడు శ్రీనివాస్ గౌడ్, గౌడ సంఘం జిల్లా నాయకుడు వీరేశం గౌడ్ పాల్గొన్నారు.

కుల వృత్తులకు బీఆర్ఎస్ పెద్దపీట 

నర్సాపూర్: కుల వృత్తులకు బీఆర్ఎస్ పెద్దపీట వేసిందని ఎమ్మెల్సీ ఎగ్గే మల్లేశ్​అన్నారు. పట్టణంలోని కంజర్ల ఫంక్షనల్ లో కురుమల ఆత్మీయ సమ్మేళనంలో ఎమ్మెల్యే మదన్ రెడ్డి, బీఆర్ఎస్ అభ్యర్థి సునీత రెడ్డిలతో కలిసి పాల్గొని మాట్లాడారు. కురుమలు అభివృద్ధి చెందడానికి సీఎం కేసీఆర్​ గొర్రెలను పంపిణీ పథకాన్ని ప్రవేశపెట్టాడన్నారు.

కురుమల సంక్షేమం కోసం బీఆర్ఎస్ ను మరోసారి ఆశీర్వదించాలని కోరారు. కార్యక్రమంలో లేబర్ వెల్ఫేర్ బోర్డ్ చైర్మన్ దేవేందర్ రెడ్డి, గ్రంథాల సమస్య చైర్మన్ చంద్ర గౌడ్, గౌడ సంఘం అధ్యక్షుడు అశోక్ గౌడ్ పాల్గొన్నారు.