బీఆర్ఎస్కు షాక్.. నీలం మధు రాజీనామా

బీఆర్ఎస్కు షాక్.. నీలం మధు రాజీనామా

సంగారెడ్డి: ఉమ్మడి మెదక్ జిల్లాలో బీఆర్ఎస్ షాక్ తగిలింది. పఠాన్ చెరు బీఆర్ఎస్ నేత నీల మధు పార్టీకి రాజీనామా చేశారు. చివరి క్షణం వరకు పార్టీ టికెట్ ఆశించిన నీల మధు..సిట్టింగ్ ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డికి బీఫామ్ ఇవ్వడంతో పార్టీకి రాజీనామా చేసినట్లు తెలుస్తోంది. అయితే తాను ఎన్నికల బరిలో ఉన్నట్లు నీలం మధు ప్రకటించారు. సొంత గ్రామమైన కొత్తపల్లి నుంచి పాదయాత్ర చేస్తున్నట్లు నీలం మధు తెలిపారు. కాగా బీఆర్ఎస్లో ముదిరాజ్ లకు సముచితం దక్కడంలేదని నేతలు ఆందోళనలో ఉన్నట్లు తెలుస్తోంది. 

తనకు టికెట్ ప్రకటించే విషయంలో బీఆర్ ఎస్ పార్టీకి అక్టోబర్ 16 వరకు డెడ్ లైన్ విధించిన నీలం మధు.. పార్టీ నాయకత్వం స్పందించకపోతే పార్టీని వీడి, పటాన్ చెరు నుంచే ఎన్నికల బరిలో ఉంటానని ఇటీవల ప్రకటించారు. అనుకున్నట్లుగానే ఇవాళ పార్టీకి రాజీనామా చేశారు. 

పటాన్ చెరులో అహంకారం కావాలా.. ఆత్మగౌరవం కావాలో ప్రజలు తేల్చుకోవాలన్నరు నీలం మధు..బీఆర్ ఎస్ రాజీనామా చేసి వచ్చే ఎన్నికల్లో ప్రజల మనిషిగా పోటీ చేస్తున్నానని ప్రకటించారు.