- భూ ప్రక్షాళన వల్లే రైతు భరోసా ఆలస్యం
- ఎక్సైజ్‌శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు
కామారెడ్డి టౌన్, వెలుగు : భూ ప్రక్షాళన జరుగుతున్నందునే రైతు భరోసా విషయంలో కొంత ఆలస్యం అవుతుందని ఎక్సైజ్ శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు చెప్పారు. కామారెడ్డి జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్‌గా మద్ది చంద్రకాంత్‌రెడ్డి ఆదివారం బాధ్యతలు చేపట్టారు. ఈ సందర్భంగా స్థానిక సత్యగార్డెన్స్‌లో నిర్వహించిన కార్యక్రమానికి మంత్రి హాజరై మాట్లాడారు. రాష్ట్రంలో మరో 4 లక్షల మందికి రుణమాఫీ చేయాల్సి ఉందన్నారు. త్వరలో జరగబోయే గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో పట్టభద్రులంతా కాంగ్రెస్ క్యాండిడేట్లకు ఓటు వేయాలని కోరారు. కాంగ్రెస్‌ను విమర్శించడమే బీఆర్‌ఎస్ పనిగా పెట్టుకుందన్నారు. పదేండ్లు అధికారంలో ఉన్న బీఆర్‌ఎస్ రాష్ట్రాన్ని లూటీ చేసిందన్నారు. ఎలక్షన్ల టైంలో ఇచ్చిన హామీలను అమలు చేస్తూ ముందుకు వెళ్తున్నామన్నారు. ప్రతి గ్రామపంచాయతీలో లైబ్రరీలను బలోపేతం చేయాలనిసూచించారు.
ప్రతి కార్యకర్తకు గుర్తింపు ఉంటుంది
కాంగ్రెస్‌లో ప్రతి కార్యకర్తకు గుర్తింపు ఉంటుందని ప్రభుత్వ సలహాదారు షబ్బీర్ అలీ చెప్పారు. ఎన్‌ఎస్‌యూఐ నుంచి వచ్చిన మద్ది చంద్రకాంత్‌రెడ్డికి జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ పదవి దక్కిందన్నారు. దోమకొండలో త్వరలోనే హాస్పిటల్ ఏర్పాటు అవుతుందన్నారు. అభివృద్ధి పనులను బీజేపీ ఎమ్మెల్యే అడ్డుకుంటున్నారని ఆరోపించారు. సోషల్ మీడియా వేదికగా ప్రభుత్వాన్ని తిట్టడమే కేటీఆర్, హరీశ్‌రావు పనిగా పెట్టుకున్నారని విమర్శించారు. అకాల వర్షాల వల్ల దెబ్బతిన్న పంటలకు పరిహారం ఇస్తున్నామని చెప్పారు. నిజమైన రైతులకు మాత్రమే రైతు భరోసా అందుతుందని స్పష్టం చేశారు. కేసీఆర్, కేటీఆర్ మూసీ పరిసరాల్లో ఉండే అక్కడి ప్రజల బాధలు తెలుస్తాయన్నారు. కార్యక్రమంలో ఎంపీ సురేశ్ షేట్కార్, రాష్ట్ర గ్రంథాలయ సంస్థ చైర్మన్ రియాజ్, డీసీసీ ప్రెసిడెంట్ కైలాశ్ శ్రీనివాసరావు, మాజీ ఎమ్మెల్యే ఏనుగు రవీందర్‌రెడ్డి, నాయకులు మానాల మోహన్‌రెడ్డి, తాహెర్‌బిన్ హందాన్, మున్సిపల్ చైర్‌పర్సన్ గడ్డం ఇందుప్రియ పాల్గొన్నారు.