- బీఆర్ఎస్ రాజ్యసభ పక్షనేత కేఆర్ సురేశ్ రెడ్డి
న్యూఢిల్లీ, వెలుగు: తెలంగాణ బొగ్గు కుంభకోణంపై పార్లమెంటులో చర్చ జరగాలని బీఆర్ఎస్ రాజ్యసభ పక్షనేత కేఆర్ సురేశ్ రెడ్డి డిమాండ్ చేశారు. అలాగే నదుల అనుసంధానం, నీటి పంపకాల విషయాలపై సమగ్ర విధానం ఉండాలనే అంశంపై విస్తృతమైన చర్చ అవసరమని తెలిపారు.
మంగళవారం ఆల్ పార్టీ మీటింగ్ అనంతరం మీడియాతో ఆయన మాట్లాడారు. తెలంగాణ, దేశ ప్రయోజనాలకు సంబంధించిన అంశాలను పార్లమెంట్ లో లేవనెత్తుతామని తెలిపారు. ఏపీ పునర్వ్యవస్థీకరణ చట్టానికి సంబంధించిన పెండింగ్ అంశాలను త్వరగా నెరవేర్చాలని పార్లమెంట్ లో గొంతెత్తుతామని చెప్పారు.
