
కామారెడ్డిటౌన్, వెలుగు : కామారెడ్డికి చెందిన బీఆర్‌ఎస్ లీడర్ రమేశ్ గుప్తా ఆదివారం బీజేపీ ఓబీసీ మోర్చా జాతీయ ప్రెసిడెంట్, ఎంపీ డాక్టర్లక్ష్మణ్ సమక్షంలో ఆదివారం బీజేపీలో జాయిన్ అయ్యారు. బీఆర్‌ఎస్ పార్టీకి రాజీనామా చేసిన రమేశ్ గుప్తా సంగారెడ్డి జిల్లా జహీరాబాద్‌లో జరిగిన పార్టీ మీటింగ్‌లో పాల్గొన్నారు. కార్యక్రమంలో ఎమ్మెల్యే వెంకటరమణారెడ్డి, ఎంపీ అభ్యర్థి బీబీ పాటిల్ తదితరులున్నారు.