కుంభకోణం జరిగిందంటే ఫోన్ సీజ్ చేసుడేంది : ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్

కుంభకోణం జరిగిందంటే ఫోన్ సీజ్ చేసుడేంది : ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్

హైదరాబాద్, వెలుగు: కుంభకోణం జరిగిందని ఆరోపణ వస్తే.. స్పందించాల్సిన పోలీసులు అక్రమ కేసు పెట్టి సెల్ ఫోన్ సీజ్ చేయడమేందని సీఎం రేవంత్ రెడ్డిని బీఆర్ఎస్ నేత ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ప్రశ్నించారు. బీఆర్ఎస్ సోషల్ మీడియా కన్వీనర్ మన్నె క్రిశాంక్ ఫోన్‌ను సీజ్ చేయడంపై గురువారం ఎక్స్ వేదికగా ఆయన స్పందించారు. ‘‘ఫోన్ సీజ్ చేశారంటే..కుంభకోణం బరాబర్ జరిగిందన్న మాట.

ప్రజల దృష్టి మరల్చడానికే మా యువ నేత మన్నె క్రిశాంక్  ఫోన్ సీజ్ చేశారు. ఇలా చేయడాన్నే పోలీసు భాషలో 'అటెన్షన్ డైవర్షన్ ఎంఓ' అంటారు’’ అని ప్రవీణ్ కుమార్ పేర్కొన్నారు. 'అటెన్షన్ డైవర్షన్ ఎంఓ' గ్యాంగులు బ్యాంకుల ముందు తచ్చాడుతూ ఖాతాదారుల మీద రంగు చల్లి వాళ్ల  పైసలనెత్తుకొని పారిపోతాయని వివరించారు. ఆ గ్యాంగులే నేడు తెలంగాణలో రాజ్యమేలుతున్నాయని ఘాటు వ్యాఖ్యలు చేశారు.