హత్యా రాజకీయాలను ఖండిస్తున్నాం

హత్యా రాజకీయాలను ఖండిస్తున్నాం
  •     బీఆర్ఎస్ కార్యకర్త శీను నాయక్ ను చంపడం దారుణం
  •      కాంగ్రెస్ డైవర్షన్ పాలిటిక్స్ చేస్తోంది
  •     తుమ్మలపై హత్య కుట్ర విషయమై విచారణ జరిపించండి
  •     మీడియాతో బీఆర్ఎస్ నేతలు

ఖమ్మం టౌన్, వెలుగు :  నారాయణఖేడ్ లోని సింగరాయ తండాలో బీఆర్ఎస్ కార్యకర్త శీను నాయక్ ను గుండాలు హత్య చేయడాన్ని ఖండిస్తున్నామని బీఆర్​ఎస్​ ఖమ్మం జిల్లా అధ్యక్షుడు, ఎమ్మెల్సీ తాతా మధు, రాజ్యసభ సభ్యుడు వద్దిరాజు రవిచంద్ర, మాజీ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్, ఖమ్మం ఎంపీ అభ్యర్థి నామా నాగేశ్వరరావు తెలిపారు. ఆదివారం పార్టీ జిల్లా కార్యాలయంలో వారు మీడియాతో మాట్లాడారు. బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ శాంతియుత పోరాటంతో తెలంగాణ సాధించారని గుర్తు చేశారు. కాంగ్రెస్ పార్టీ హత్య రాజకీయాలను పెంచి పోషిస్తోందని ఆరోపించారు.

బీఆర్ఎస్ కార్యకర్తలపై అక్రమ కేసులు పెట్టడం, దాడులు చేయడం దుర్మార్గ చర్య అన్నారు. కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలను నెరవేర్చకుండా డైవర్షన్ పాలిటిక్స్ చేస్తోందని ఆరోపించారు. కాళేశ్వరం ప్రాజెక్ట్, ఫోన్ ట్యాపింగ్ లాంటి వాటిని తెరపైకి తెచ్చి ప్రజల ఆలోచనను కాంగ్రెస్ డైవర్షన్ చేస్తూ సంక్షేమ పథకాల అమలును మరిపిస్తోందన్నారు. నాలుగు నెలల పాలనలో ఖమ్మం జిల్లాలో ముగ్గురు మంత్రులు చేసిందేమీ లేదన్నారు.

మంత్రి తుమ్మలపై హత్యకు కుట్ర జరిగిందని వార్తలు రాపిస్తూ, స్క్రిప్ట్ తయారు చేసుకుంటున్నారని ఆరోపించారు. అజయ్ కుమార్ పై హత్య కుట్ర ఆరోపణలు చేయడం బాధాకరమన్నారు. దీనిపై పూర్తి విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు. జిల్లా అభివృద్ధి చెందాలంటే పార్లమెంట్ ఎన్నికల్లో నామాను గెలింపించుకోవాలని పిలుపునిచ్చారు. 

కష్టాల్లో ఉన్న బీఆర్ఎస్ ను కాపాడుకోవాలి 

కారేపల్లి  : కష్టాల్లో ఉన్న బీఆర్ఎస్ ను  కార్యకర్తలు కాపాడుకోవాలని రాజ్యసభ సభ్యుడు వద్దిరాజు రవిచంద్ర కోరారు. ఆదివారం పట్టణంలోని వైఎస్ఎన్ గార్డెన్​లో నిర్వహించిన కారేపల్లి మండలం బీఆర్ఎస్ ముఖ్య కార్యకర్తల సమావేశంలో మాజీ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్, ఖమ్మం ఎంపీ అభ్యర్థి నామాతో కలిసి ఆయన మాట్లాడారు. రైతు పక్షపాతిగా కేసీఆర్ పదేళ్ల పాలన సాగిందని

30 లక్షల టన్నుల నుంచి 3 కోట్ల టన్నుల ధాన్యం పండించే స్థాయికి తెలంగాణ అభివృద్ధి చేశారని గుర్తు చేశారు. కానీ ప్రజలు అమలుకాని హామీలకు ఆశపడి కాంగ్రెస్ కు ఓట్లు వేశారని, ఇప్పుడు కాంగ్రెస్ మోసాలను గమనించాలని చెప్పారు. లోక్​సభ ఎన్నికల్లో తెలంగాణ సమస్యలను పార్లమెంట్​లో ప్రస్తావించే సమర్థవంతమైన నేత నామాను గెలిపించాలని కోరారు.