జాగృతిలో చేరిన బీఆర్ఎస్ నేతలు

జాగృతిలో చేరిన బీఆర్ఎస్ నేతలు

నిజామాబాద్, వెలుగు: పలువురు బీఆర్​ఎస్​ నేతలు బుధవారం నిజామాబాద్ నగరంలోని జాగృతి ఆఫీస్​లో తెలంగాణ జాగృతి పార్టీలో చేరగా అధ్యక్షురాలు కవిత కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. 

పార్టీలో చేరిన వారిలో మోపాల్​ మాజీ జడ్పీటీసీ సభ్యుడు నరేశ్​, బీఆర్​ఎస్​ కార్మిక విభాగం జిల్లా అధ్యక్షురాలు విజయలక్ష్మి, బీసీ నేత శ్రీనివాస్​గౌడ్​, యాదవ సంఘం జిల్లా అధ్యక్షురాలు మంజుల యాదవ్, తెలంగాణ ఉద్యమకారుడు సూదం రవిచంద్ర, బోధన్​ సెగ్మెంట్ పరిధిలోని రాంపూర్ మాజీ సర్పంచ్ దొంత ప్రవీణ్, మహంతం మాజీ సర్పంచ్ రాజేశం, బినోల మాజీ సర్పంచ్ పీతంబర్, మోకాన్​పల్లి మాజీ ఎంపీటీసీ జనార్దన్​, నందిగావ్​ మాజీ ఎంటీపీసీ సంజీవ్​ రెంజల్ మండలానికి చెందిన తెలంగాణ శంకర్, గౌరాజీ రాఘవేంద్ర,  శేఖర్​రాజ్​, జాదవ్​రాజ్ తదితరులు ఉన్నారు.