ప్రజల కష్టం తెలియని వాళ్లు రాజకీయం చేస్తున్రు : డీకే అరుణ

ప్రజల కష్టం తెలియని వాళ్లు రాజకీయం చేస్తున్రు : డీకే అరుణ

గద్వాల, వెలుగు : ప్రజల కష్టం తెలియని వాళ్లు రాజకీయం చేస్తున్నారని బీజేపీ జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే అరుణ పేర్కొన్నారు. పట్టణంలోని డీకే బంగ్లాలో ధరూర్ మండలం ఖమ్మంపాడు గ్రామానికి చెందిన బీఆర్ఎస్  నాయకులు పార్టీలో చేరగా, వారికి కాషాయ కండువా కప్పి ఆహ్వానించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ తాను ఉన్నంతకాలం పేద ప్రజలకు న్యాయం చేస్తూ, గద్వాల అభివృద్ధే ధ్యేయంగా పని చేస్తానన్నారు.

జిల్లా అధ్యక్షుడు రాంచంద్రారెడ్డి, ప్రధాన కార్యదర్శి రవికుమార్, బండల వెంకట్రాములు, మిర్జాపురం వెంకటేశ్వర రెడ్డి, ఖమ్మంపాడు సర్పంచ్ పార్వతమ్మ, ఉప సర్పంచ్  సురేశ్, సరళమ్మ, బాబుల్ రెడ్డి,అశోక్, తిమ్మారెడ్డి, వెంకటేశ్వరరెడ్డి ఉన్నారు.