బీఆర్ఎస్ నేతల అత్యుత్సాహం

బీఆర్ఎస్ నేతల అత్యుత్సాహం

గంగాధర, వెలుగు : మంత్రి కేటీఆర్ పుట్టినరోజు సందర్భంగా మండలంలోని బీఆర్ఎస్ నాయకులు అత్యుత్సాహం ప్రదర్శించారు.   మండల కేంద్రంలోని జ్యోతిబాపూలే బాలుర గురుకుల స్కూల్​లో విద్యార్థులను నేలపై కూర్చోబెట్టి విన్యాసాలు చేయించారు. ‘మంత్రి పుట్టినరోజుకు  విద్యార్థులకు ఏం సంబంధం’ అని పలువురు విమర్శిస్తున్నారు.

విద్యార్థులు అరగంట పాటు నేలపై కూర్చొని ఇబ్బందులు పడ్డారని, విద్యార్థులతో విన్యాసాలు చేయించిన వారిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.