ఎమ్మెల్యే ముత్తిరెడ్డిపై మర్లవడ్డ గ్రామస్తులు

ఎమ్మెల్యే ముత్తిరెడ్డిపై మర్లవడ్డ గ్రామస్తులు

సిద్దిపేట జిల్లాలో బీఆర్ఎస్ ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరి రెడ్డికి నిరసన సెగ తగిలింది. చేర్యాల మండలం కడవేర్గ్ గ్రామంలో బ్రిడ్జి నిర్మాణనికి భూమి పూజ చేసి నెలలు గడిచినా పనులు పూర్తి కావడం లేదని గ్రామస్తులు ఎమ్మెల్యేను ప్రశ్నించారు.  గ్రామంలో డబుల్ బెడ్ రూంలు, వాటర్ ప్లాంట్ పూర్తయినా ప్రారంభనికి నోచుకోవడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. తాగు నీళ్ల కోసం మహిళలు బిందెలతో చాలా దూరం వెళ్లాల్సి వస్తుందని చెప్పారు. పోలీసులు జోక్యం చేసుకుని గ్రామస్తులను అడ్డుకున్నారు.