తెలుగు తమ్ముళ్లను ఓటు అడిగే హక్కు నాకే ఉంది : సండ్ర వెంకటవీరయ్య

తెలుగు తమ్ముళ్లను ఓటు అడిగే హక్కు నాకే ఉంది : సండ్ర వెంకటవీరయ్య

పెనుబల్లి, వెలుగు : సత్తుపల్లి నియోజకవర్గంలో టీడీపీని చివరి వరకు కాపాడిన ఏకైక కార్యకర్తను తానేనని, ఇక్కడ తెలుగు తమ్ముళ్లను ఓటు అడిగే హక్కు తనకు మాత్రమే ఉందని బీఆర్ఎస్​అభ్యర్థి సండ్ర వెంకటవీరయ్య చెప్పారు. బుధవారం పెనుబల్లి మండలంలోని పలు గ్రామాలలో నిర్వహించిన ప్రచారంలో ఆయన మాట్లాడారు. సత్తుపల్లి నియోజకవర్గం నుంచి మూడుసార్లు ఎమ్మెల్యే గా గెలిపిస్తే ఒక సేవకుడిగా ప్రజలకు కోసం పనిచేశానని చెప్పారు.

దళితబంధు పై కొంతమంది కావాలని అసత్య ప్రచారం చేస్తున్నారని,  క్రిస్​మస్​ లోపు దళితబంధు అమలు చేయకపోతే సర్పంచ్​, ఎంపీటీసీల ఎన్నికలలో ఓట్లు కూడా అడగబోనని తెలిపారు. ఎన్నికలైన వారం రోజులలోనే యాదవులకు రెండోవిడత గొర్రెల పంపిణీ చేస్తామని చెప్పారు. కార్యక్రమంలో ఎంపీపీ లక్కినేని అలేఖ్య, జడ్పీటీసీ చెక్కిలాల మోహనరావు, పార్టీ మండల అధ్యక్షుడు కనగాల వెంకట్రావు, నీలాద్రీ చైర్మన్​ పసుమర్తి వెంకటేశ్వరావు, మండల నాయకులు చెలికాని నీలాద్రీబాబు, మందడపు అశోక్ , కనగాల సురేశ్, తెల్లగొర్ల జనార్ధన్​, చెక్కిలాల లక్ష్మణరావు, యడ్ల సుబ్బారావు, రామప్ప, పొట్లపల్లి శంకర్, లక్కినేని వినీల్​ తదితరులు పాల్గొన్నారు. 

ALSO READ : హామీల అమలులో బీఆర్ఎస్ సర్కార్ ఫెయిల్ : పాయం వెంకటేశ్వర్లు