ఉద్యమకారులు అన్నమో రామచంద్రా అని రోడ్డున పడ్డారు

ఉద్యమకారులు అన్నమో రామచంద్రా అని రోడ్డున పడ్డారు

తెలంగాణలో ఎన్నికలు సమీపిస్తున్న వేళ వలసలు మొదలయ్యాయి. మేడ్చల్ జిల్లా తూముకుంటలో కొంతమంది  ఉద్యమకారులు టీపీసీసీ అధ్యక్షులు రేవంత్ రెడ్డి సమక్షంలో పార్టీ కండువా కప్పుకున్నారు. వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ గెలుపునకు ఇదే నిదర్శనమన్నారు.తూముకుంటలో రేవంత్ కు స్థానిక నేతలు, మహిళా కార్యకర్తలు ఘనంగా స్వాగతం పలికారు.  చౌరస్తా నుంచి మొగుళ్ళ వెంకటరెడ్డి ఫంక్షన్ హాల్ వరకు భారీ ర్యాలీ నిర్వహించారు. 

అనంతరం జరిగిన సభలో రేవంత్ మాట్లాడుతూ అమరవీరుల కుటుంబాలు నేడు అన్నమో రామచంద్రా అని రోడ్డున పడుతున్న మాట వాస్తవం కాదా? ప్రశ్నించారు. నిజమైన ఉద్యమకారులు ఆలస్యంగాఅయినామేల్కొని...తెలంగాణఇచ్చిన కాంగ్రెస్ పార్టీలోచేరినందుకుచాలాసంతోషంగా ఉందన్నారు.రాష్ట్రంలోని విద్యావంతులు, మేధావులు, సామాన్య ప్రజానీకం ఆలోచించి కాంగ్రెస్ పార్టీని ఆదరించాలని కోరారు.  తెలంగాణ ఇచ్చిన కాంగ్రెస్ పార్టీకి రాష్ట్రాన్ని అభివృద్ధి చేయడం పెద్ద సమస్య కాదంటూ... తెలంగాణ వచ్చాక కేసీఆర్ కుటుంబం మాత్రమే బాగుపడిందని రేవంత్ అన్నారు. కాంగ్రెస్ అధికారంలోకి వస్తే రాష్ట్రంలోని అన్ని కుటుంబాలు బాగుపడతాయన్నారు టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి.  తెలంగాణ కోసం అమరులైన వారి త్యాగాలను గుర్తించి సోనియా గాంధీ తెలంగాణ రాష్ట్రాన్ని ఇచ్చిన మాట వాస్తవం కాదా? అని ప్రశ్నించారు.  తెలంగాణ ద్రోహి కేసీఆర్..ఉద్యమకారులను ఉరికించి కొట్టించిన దొంగలను ... ఈరోజు కేసీఆర్ పక్కన పెట్టుకొని తిరగడం నిజం కాదా అని ప్రశ్నించారు.  

ఈ కార్యక్రమానికి మేడ్చల్ జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు నందికంటి శ్రీధర్ అధ్యక్షత వహించగా తూముకుంట మున్సిపల్ లో బిఆర్ఎస్, బిజెపి పార్టీల నుంచి తెలంగాణ ఉద్యమకారులు చిర్రబోయిన రాంచందర్ యాదవ్ ఆధ్వర్యంలో టీపీసీసీ సీనియర్ అధికార ప్రతినిధి, మేడ్చల్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ కోఆర్డినేటర్ సింగిరెడ్డి హరివర్ధన్ రెడ్డి, తూముకుంట మున్సిపల్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు భీమిడి జైపాల్ రెడ్డి  నేతృత్వంలో టిపిసిసి అధ్యక్షులు ఎనుముల రేవంత్ రెడ్డి సమక్షంలో కాంగ్రెస్ పార్టీలోకి చేరారు.