బీఎస్పీ వర్సెస్​ బీఆర్ఎస్

బీఎస్పీ వర్సెస్​ బీఆర్ఎస్

బీఎస్పీ వర్సెస్​ బీఆర్ఎస్
ఎమ్మెల్యేకు వినతిపత్రం ఇవ్వబోగా అడ్డుకున్న బీఆర్​ఎస్ ​నాయకులు
కార్యకర్తల మధ్య తోపులాట

చిన్నచింతకుంట, వెలుగు : పాలమూరు జిల్లా చిన్నచింతకుంట మండల కేంద్ర సమీపంలో ఓ ఫంక్షన్ హాలులో గురువారం ఏర్పాటు చేసిన బీఆర్ఎస్​ ఆత్మీయ సమ్మేళనంలో ఆ పార్టీ కార్యకర్తలకు, బీఎస్పీ లీడర్ల మధ్య తోపులాట చోటు చేసుకుంది. ఈ కార్యక్రమానికి దేవరకద్ర ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వర్ రెడ్డి హాజరయ్యారు.

ఈ సందర్భంగా మండలంలో జూనియర్ కాలేజీ ఏర్పాటు, డబుల్ బెడ్ రూం ఇండ్ల పంపిణీ, దళిత బంధు, ఆసరా పెన్షన్లు తదితర డిమాండ్లతో ఎమ్మెల్యేకు వినతిపత్రం ఇవ్వడానికి  బీఎస్పీ నాయకులు వచ్చారు. దీంతో వారిని అక్కడున్న  బీఆర్ఎస్ కార్యకర్తలు అడ్డుకోగా ఇరు వర్గాల మధ్య తోపులాట జరిగింది. అక్కడే ఉన్న పోలీసులు జోక్యం చేసుకుని రెండు పార్టీల కార్యకర్తలను పక్కకు పంపించేశారు. కొద్దిసేపటికి బీఎస్పీ లీడర్లను అదుపులోకి తీసుకున్నారు. బీఎస్పీ లీడర్లు సత్యనారాయణ సాగర్, రవి, రవీందర్, దివాకర్, జైపాల్, నరేశ్, రవితేజ, అంజన్న, రాములు, శేఖర్ పాల్గొన్నారు.