జూనియర్ సివిల్ జడ్జిగా ఎంపికైన కృష్ణ తేజ

జూనియర్  సివిల్ జడ్జిగా ఎంపికైన కృష్ణ తేజ

కల్వకుర్తి, వెలుగు: కల్వకుర్తి పట్టణానికి చెందిన బృంగి కృష్ణ తేజ జూనియర్  సివిల్  జడ్జిగా ఎంపికయ్యాడు. బీఏ, ఎల్ఎల్ఎం చదివిన కృష్ణతేజ మొదటి ప్రయత్నంలోనే జూనియర్  సివిల్  జడ్జిగా ఎంపిక కావడంతో స్థానికులు, బంధువులు అభినందించారు.

 తండ్రి అమరేందర్  న్యాయవాది కాగా, చిన్నాన్న బృంగి శ్రీనివాసులు జిల్లా జడ్జిగా ఉన్నారు. కృష్ణతేజ ప్రాథమిక విద్యాభ్యాసం కల్వకుర్తిలో, హైస్కూల్, ఇంటర్, బీఏ, ఎల్ఎల్ఎం హైదరాబాద్ లో చదువుకున్నారు.