IT News: టెక్కీలూ హీరోల్లా అస్సలు ఫీలవ్వొద్దు.. ఆరోగ్యం షెడ్డుకెల్లుద్ది.. హెల్త్ వార్నింగ్ రగడ..

IT News: టెక్కీలూ హీరోల్లా అస్సలు ఫీలవ్వొద్దు.. ఆరోగ్యం షెడ్డుకెల్లుద్ది.. హెల్త్ వార్నింగ్ రగడ..

Bryan Johnson: భారతదేశం ప్రపంచవ్యాప్తంగా తన ఐటీ సేవల ఎగుమతికి పెట్టింది పేరు. దీనికి ప్రధాన కారణంగా అమెరికా, యూరప్ వంటి దేశాల కంటే తక్కువ వేతనాలకే పనిచేసే వర్క్ ఫోర్స్ అందుబాటులో ఉండటమే. అయితే ప్రస్తుతం ఇండియాలో సాఫ్ట్ వేర్ జాబ్ డ్రీమ్స్ రెండు దశాబ్ధాల నుంచి తారాస్థాయికి చేరాయి. అయితే డాక్టర్ లేదంటే టెక్కీ అనే స్థాయికి తల్లిదండ్రులు, విద్యార్థులు కూడా మారిపోయిన సంగతి తెలిసిందే. 

తాజాగా తెల్లవారుజామున 4 గంటల సమయంలో కోడింగ్ చేస్తున్న టెక్కీలకు సంబంధించిన ఒక ఫోటో ఒకటి సోషల్ మీడియాలో పోస్ట్ చేయబడింది. అయితే దీనిపై అమెరికాకు చెందిన టెక్ వ్యవస్థాపకుడు, యాంటీ ఏజింగ్ పై అవగాహన కల్పించే బ్రయాన్ జాన్సన్ తీవ్రంగా విమర్శలు చేశారు. వాస్తవానికి ఈ జీవనవిధానం ఆరోగ్యన్ని పాడుచేస్తుందని ఆయన హెచ్చరించారు. కొందరు భారతీయ టెక్కీలు హీనిని హీరోయిజం అనుకుంటున్నారని, కానీ తీవ్రమైన అనారోగ్య సమస్యలు వస్తాయని ఆయన అన్నారు.

 

వెబ్ డెవలపర్లు పొద్దుపోయే వరకు కోడింగ్ చేస్తున్నట్లు తమ టీమ్ ఫోటోను యువ టెక్కీ షేర్ చేశారు. దీనిపై స్పందించిన బ్రయాన్ హెచ్చరిస్తూ.. ఫొటోలు కూర్చున్న రీతిలో పనిచేయటం వల్ల మెదడుకు వెళ్లే ఆక్సిజన్ సరఫరా 30 శాతం తగ్గిపోతుందన్నారు. అలాగే ఆఫీసులోని బ్లూ లైట్ వల్ల మెలటోనిన్ తయారీని తగ్గిస్తుందని, నిద్రలేమి, ఇన్సులెన్ సెన్సిటివిటీ, కార్టిసాల్ పెరుగుదల, ఊబకాయం, మతిమరుపు వంటి అనేక సమస్యలు వస్తాయని హెచ్చరించారు. 

►ALSO READ | UPI News: యూపీఐ యూజర్లకు అలర్ట్.. ఆగస్టు 1 నుంచి NPCI కొత్త ఆంక్షలు..!

నిరంతరం ఆఫీసులో ల్యాప్ టాప్ స్కీన్ చూడటం అనేక సమస్యలకు దారితీస్తుందన్నారు. అలాగే తక్కువ సేపు నిద్రించటం వల్ల ఒత్తిడి పెరుగుతుందని కూడా హెచ్చరించారు. కొందరు బ్రయాన్ హెచ్చరికకు సానుకూలంగా స్పందించగా.. మరికొందరు మాత్రం వాస్తవానికి దగ్గరగా ఉండాలని, టెక్ రంగంలో కెరీర్ నిర్మాణానికి ఇంత కష్టం ఉంటుందని పేర్కొన్నారు. 

మరొక యూజర్ స్పందింస్తూ నువ్వు కూడా ఒకానొక సమయంలో వ్యాపార నిర్మాణ దశలో ఉన్నప్పుడు ఇలాగే కష్టపడి ఉంటావ్ జాన్సన్ అంటూ కామెంట్ చేశారు. అయితే తర్వాతి కాలంలో తన బ్రెయిన్ ట్రీ వ్యాపారాన్ని పేపాల్ కి 800 మిలియన్ డాలర్లకు అతను విక్రయించాడు. అయితే మరికొందరు మాత్రం నిద్ర చాలా అవసరమని, రోజూ శరీరానికి అవసరమైన రెస్ట్ అందించకపోతే అది మెదడు పనితీరును దెబ్బతీస్తుందని అన్నారు.