
కర్ణాటకలో వీరశైవ-లింగాయత్ సామాజిక వర్గం కోసం కొత్త అభివృద్ధి బోర్డును ఏర్పాటు చేయనున్నారు ఆ రాష్ట్ర సీఎం బీఎస్ యెడ్యురప్ప. కర్ణాటక జనాభాలో సుమారు 16% వీరశైవ లింగాయత్ సామాజిక వర్గం ఉంది. కర్ణాటకలో వీరశైవ లింగాయత్ సామాజిక వర్గం బీజేపీకి ప్రధాన మద్దతు దారుగా ఉంటుంది. ముఖ్యమంత్రి యెడ్యురప్ప కూడా ఈ సామాజికవర్గానికే చెందినవారు. ‘మరాఠా డెవలప్‌మెంట్ అథారిటీ’ ఏర్పాటుకు ఆదేశించిన కొన్ని రోజులకే యెడ్యురప్ప ఈ నిర్ణయం తీసుకోవడం గమనార్హం. అయితే రాష్ట్రంలోని బసవకళ్యాణ్ అసెంబ్లీ నియోజకవర్గానికి రాబోయే ఉప ఎన్నికను దృష్టిలో పెట్టుకుని ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తుంది. అక్కడ మరాఠాలు కూడా పెద్ద సంఖ్యలో ఉండడం గమనార్హం.
కర్ణాటకలో వీరశైవ లింగాయత్‌లలో ఎక్కువమంది ఆర్థికంగా, సామాజికంగా మరియు విద్యాపరంగా వెనుకబడి ఉన్నారు. ఇలాంటి వారి కోసం సహాయం అందించడానికి.. వీరి అభివృద్ధికి కృషి చేసే బోర్డు తక్షణమే అమల్లోకి రావాలని సిఎం యెడియరప్ప ముఖ్య కార్యదర్శి టిఎం విజయ్ భాస్కర్‌కు ఇచ్చిన నోట్‌లో పేర్కొన్నారు.