పాకిస్తాన్ నుంచి డ్రోన్ దాడులు.. పిట్టల్లా కూల్చేస్తున్న మన జవాన్లు

పాకిస్తాన్ నుంచి డ్రోన్ దాడులు.. పిట్టల్లా కూల్చేస్తున్న మన జవాన్లు

భారత రక్షణ శాఖ ఎదురు దాడులనే కాకుండా.. టెక్నికల్ దాడులను సైతం అంతే గట్టిగా ఎదుర్కొని తలబడి నిలబడుతోంది. ఈ ఒక్క ఏడాదే అంటే 2024 జనవరి  నుంచి జూలై నెల వరకు పాకిస్తాన్ పంజాబ్ సరిహద్దు ప్రాంతాల్లో 125 డ్రోన్ లను కూల్చివేసింది.  కొన్నేళ్లుగా, పంజాబ్‌లోని పాకిస్తాన్‌తో అంతర్జాతీయ సరిహద్దు దాటి భారత భూభాగంలోకి ఎగురుతున్న డ్రోన్‌ల సంఖ్య గణనీయంగా పెరిగింది.

 2023లో 107. 2022లో, BSF మొత్తం సంవత్సరంలో 22 డ్రోన్‌లను మాత్రమే అడ్డగించింది. ఇప్పుడు ఆ సంఖ్య పెరగడమే కాకుండా ఆరు నెలల్లోనే రీచ్ కావడం అందర్ని కలవరపరుస్తుంది. డ్రోన్లు , డ్రగ్స్, ఆయుధాలు, మందుగుండు సామాగ్రి, నకిలీ కరెన్సీని కలిగి ఉంటాయి.  జనవరి నుంచి జూలై 9 మధ్య కాలంలో దాదాపు 145 కిలోల హెరాయిన్, 15 కిలోల నల్లమందును BSF స్వాధీనం చేసుకుంది. 

చైనీస్ తయారు చేసిన DJI Mavic-3 క్లాసిక్ డ్రోన్‌లు పంజాబ్‌లో స్వాధీనం చేసుకున్న వాటిలో ఎక్కువగా ఉన్నట్టు తెలుస్తుంది.  వీటిని అరికట్టేందుకు భారత జవాన్లు కాల్పులు జరుపుతారు. గత ఆరు నెలల్లో 35 మంది భారతీయ స్మగ్లర్లను పట్టుకున్నారు. పంజాబ్‌లో భారతదేశం నుండి పాకిస్తాన్‌లోకి ప్రవేశించడానికి ప్రయత్నిస్తుండగా 42 మంది వ్యక్తులు పట్టుబడ్డారు. BSF సరిహద్దు వద్ద 21 మంది పాకిస్తానీ పౌరులను కూడా పట్టుకుంది. 

వారిలో 13 మందిని తిరిగి పాకిస్తాన్‌కు అప్పగించింది, వారు అనుకోకుండా సరిహద్దు దాటినట్లు తేలింది. ఒక బంగ్లాదేశీ, ఒక ఆఫ్ఘన్ పౌరుడు కూడా సరిహద్దులో పట్టుబడ్డాడు. 2 కోట్ల విలువైన భారతీయ కరెన్సీ, రూ. 40 వేల విలువైన భారత నకిలీ కరెన్సీ, రూ. 36 వేల విలువైన పాకిస్తానీ కరెన్సీ, కొన్ని వందల బంగ్లాదేశ్ టాకాస్ కూడా స్వాధీనం చేసుకున్నారు భద్రతా బలగాలు.

పంజాబ్‌కు పాకిస్తాన్‌తో 553 కి.మీ పొడవైన సరిహద్దు ఉంది. పాకిస్తాన్ నుండి భారతదేశంలోకి, ఎక్కువగా అబోహర్, ఫిరోజ్‌పూర్, తరన్ తరణ్, అమృత్‌సర్, గురుదాస్‌పూర్ మరియు పఠాన్‌కోట్ జిల్లాల్లో నుంచి ఎంటర్ కావడాని ప్రయత్నిస్తారని సమాచారం.  ఇండో-పాక్ సరిహద్దుల్లోని అన్ని ముఖ్యమైన ప్రాంతాలలో సీసీటీవీ కెమెరాలను ఏర్పాటు చేసేందుకు పంజాబ్ పోలీసులు విస్తృతంగా కసరత్తు చేపట్టారు.