54 వేల మందికి బీఎస్‌‌ఎన్‌ఎల్‌ ఉద్వాసన?

54 వేల మందికి బీఎస్‌‌ఎన్‌ఎల్‌ ఉద్వాసన?

బెంగళూరు : ప్రభుత్వరంగ టెలికాం సంస్థ  బీఎస్‌ఎ ఎల్ భారీ సంఖ్యలో ఉద్యోగులకు ఉద్వాసన పలుకుతోంది. 54 వేలకు పైగా ఉద్యోగులను తీసివేసే ప్రతిపాదనను బీఎస్‌ఎన్‌ఎల్ బోర్డు ఆమోదించిందని డెక్కన్ హెరాల్డ్ వార్తా కథనం తెలిపింది. 2019లోక్‌ సభ ఎన్నికల అనంతరం దీనిపై తుదిప్రకటన ఉంటుందని పేర్కొంది. ప్రభుత్వ నిపుణుల బృందం ప్రతిపాదించి న పది సూచనలలో మూడింటిని బీఎస్‌ఎన్‌ఎల్ బోర్డు ఆమోదించిందని ఆ రిపోర్టు చెప్పింది. బోర్డు ఆమోదించిన ప్రతిపాదనలలో ప్రస్తుతమున్నపదవీ విరమణ వయసును 60 ఏళ్ల నుంచి 58 ఏళ్లకు తగ్గించడం, వాలంటరీ రిటైర్‌‌‌‌మెం ట్ స్కీమ్ ఉన్నాయని రిపోర్టు వెల్లడించింది.పదవీ విరమణ వయసును తగ్గించడం ,వాలంటరీ రిటైర్‌‌‌‌మెంట్ స్కీమ్‌‌ను ప్రకటించడంతో సుమారు 54,451 బీఎస్‌ ఎన్‌ ఎల్ ఉద్యోగులపై ప్రభావం పడుతుందని తెలుస్తోంది. బీఎస్‌ఎన్‌ఎల్‌లో మొత్తం లక్షా 74 వేల మంది ఉద్యోగులున్నారు.