Tech News : BSNL సీనియర్ సిటిజన్ ప్లాన్.. అదరగొట్టిన ఆఫర్స్

Tech News : BSNL సీనియర్ సిటిజన్ ప్లాన్.. అదరగొట్టిన ఆఫర్స్

సీనియర్ సిటిజన్స్ కోసం అదిరిపోయే ప్లాన్ తీసుకొచ్చింది BSNL. BSNL సమ్మాన్ ప్లాన్ పేరుతో వస్తున్న ఈ ప్లాన్ ఈ ప్లాన్‌ను 60 ఏళ్లు పైబడిన యూజర్స్ కోసం ప్రత్యేకంగా తీసుకొచ్చింది. 365 రోజుల వ్యాలిడిటీతో అన్ లిమిటెడ్ కాల్స్, 2జీబీ 4G డేటా, రోజుకు 100 sms లు, 6 మంత్స్ Bi TV సుబ్స్క్రిప్షన్ తో వస్తున్న ప్యాక్ కేవలం రూ. 1,812 కే అందిస్తోంది BSNL.రోజువారీ 2GB డేటా అయిపోయిన తర్వాత కూడా, 40kbps స్పీడ్ తో ఇంటర్నెట్‌ను అందిస్తోంది BSNL. అయితే, BSNL 4G ఇంటర్నెట్ డేటా మాత్రమే అందిస్తుంది. 

నవంబర్ 18 వరకు ఆఫర్:

రూ. 1,812తో వస్తున్న ఈ ప్లాన్ నవంబర్ 18 వరకు అందుబాటులో ఉంటుందని తెలిపింది BSNL. ఈ ప్లాన్ కొన్నవారికి ఫ్రీ సిమ్ కార్డు కూడా అందిస్తోంది BSNL. ఈ ప్లాన్ తీసుకున్న సీనియర్ సిటిజన్స్ 6 నెలల Bi TV సుబ్స్క్రిప్షన్ కూడా ఫ్రీగా అందిస్తోంది BSNL. 365 వ్యాలిడిటీతో వస్తున్న ఈ అదిరిపోయే ప్లాన్ నవంబర్ 18 వరకు అందుబాటులో ఉంటుంది.

BSNL సంస్థ 25 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా ఇటీవల BSNL 4G సేవలను ప్రారంభించింది. ఈ క్రమంలో BSNL కి 92 వేల 600 కొత్త టవర్లను ఇష్యూ చేసింది BSNL. దీంతో నెట్వర్క్, సిగ్నల్ సమస్య చాలావరకు తగ్గిందని తెలిపింది సంస్థ.

క్రమంగా తగ్గుతున్న BSNL కస్టమర్స్:

జులై 2025 TRAI గణాంకాల ప్రకారం BSNL కస్టమర్ల సంఖ్య క్రమంగా తగ్గుతున్నట్లు తెలుస్తోంది. జులై నెలలో BSNL 1.01 లక్షల మంది కస్టమర్లను కోల్పోయినట్లు తెలుస్తోంది. దీంతో మార్కెట్లో BSNL వాటా 8 శాతానికి తగ్గినట్లు వెల్లడించింది TRAI. TRAI రిపోర్ట్ ప్రకారం జులై నెలలో జియో అత్యధికంగా 4 లక్షల 83 వేల మంది కస్టమర్లను పెంచుకోగా.. ఎయిర్టెల్ 4 లక్షల 64 వేల మంది కస్టమర్లను పెంచుకున్నట్లు తెలుస్తోంది.ఇక వోడాఫోన్ ఐడియా 3 లక్షల 59 వేల మంది కస్టమర్లను కోల్పోయినట్లుయ్ TRAI రిపోర్ట్ ద్వారా తెలుస్తోంది.