బీఎస్పీ, బీఆర్ఎస్  కూటమి విజయం ఖాయం : ఆర్‌‌‌‌ఎస్‌‌‌‌ ప్రవీణ్‌‌‌‌కుమార్‌‌‌‌

బీఎస్పీ, బీఆర్ఎస్  కూటమి విజయం ఖాయం : ఆర్‌‌‌‌ఎస్‌‌‌‌ ప్రవీణ్‌‌‌‌కుమార్‌‌‌‌

నాగర్‌‌‌‌కర్నూల్‌‌‌‌ టౌన్‌‌‌‌, వెలుగు : వచ్చే పార్లమెంట్ ఎన్నికల్లో బీఎస్పీ, బీఆర్‌‌‌‌ఎస్‌‌‌‌ కూటమి విజయం సాధించడం ఖాయమని బీఎస్పీ రాష్ట్ర అధ్యక్షుడు ఆర్‌‌‌‌ఎస్‌‌‌‌. ప్రవీణ్‌‌‌‌కుమార్‌‌‌‌ ధీమా వ్యక్తం చేశారు. శుక్రవారం నాగర్‌‌‌‌ కర్నూల్‌‌‌‌లోని సాయి గార్డెన్స్‌‌‌‌లో నిర్వహించిన కాన్షీరాం 90వ జయంతి సభలో ఆయన మాట్లాడారు. బీజేపీ మూడోసారి అధికారంలోకి వస్తే రాజ్యాంగాన్ని మార్చేస్తుందని ఆరోపించారు. దేశంలోని సంపద మొత్తాన్ని కేంద్రం కార్పొరేట్లకు ధారదత్తం చేస్తోందని విమర్శించారు. కాంగ్రెస్, బీజేపీ దోపిడీ పార్టీలన్నారు. బీజేపీ, కాంగ్రెస్‌‌‌‌ బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీలకు వ్యతిరేకంగా చట్టాలు రూపొందిస్తున్నాయని చెప్పారు.

పేద వర్గాల అభ్యున్నతే లక్ష్యంగా బీఎస్పీ అధినేత్రి మాయావతితో కేసీఆర్‌‌‌‌ కలిశారని చెప్పారు. బీఎస్పీ, బీఆర్‌‌‌‌ఎస్‌‌‌‌ ఉమ్మడి క్యాండిడేట్‌‌‌‌గా నాగర్‌‌‌‌ కర్నూల్‌‌‌‌ నుంచి తాను పోటీ చేయనున్నట్లు ప్రకటించారు. తనను ఎంపీగా గెలిపిస్తే ఈ ప్రాంత సమస్యలను పార్లమెంట్‌‌‌‌లో ప్రశ్నించి, వాటి పరిష్కారానికి కృషి చేస్తానని చెప్పారు. బీఎస్పీ జిల్లా అధ్యక్షుడు పృథ్వీరాజ్‌‌‌‌కుమార్‌‌‌‌ ఉన్నారు.