బీఫామ్ కోసం బీఆర్ఎస్ లో కుమ్ములాట : కేశవరావు

బీఫామ్ కోసం బీఆర్ఎస్ లో  కుమ్ములాట : కేశవరావు

అలంపూర్,వెలుగు :  అలంపూర్ బీఆర్ఎస్ లో  బీ ఫామ్ కోసం కుమ్ములాట నడుస్తోందని బీఎస్పీ  అభ్యర్థి ఎంసీ  కేశవరావు అన్నారు. సోమవారం పట్టణంలోని చౌరస్తాలో నిర్వహించిన సమావేశంలో  ఆయన మాట్లాడుతూ  ఎమ్మెల్యే అబ్రహం, ఎమ్మెల్సీ చల్లా వెంకట్రామిరెడ్డి  ప్రజల గోసను పట్టించుకోవడం లేదన్నారు.

బహుజన రాజ్యాధికార యాత్రతో ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ప్రజల మధ్యన ఉన్నారన్నారు.  జోగులాంబ రైల్వేస్టేషన్ అభివృద్ధి, సాగునీటి ప్రాజెక్టుల పూర్తి, అలంపూర్ ను బీఎస్పీ అభివృద్ధి చేస్తుందన్నారు. విద్య, వైద్యానికి పెద్దపీట వేస్తామన్నారు. కార్యక్రమంలో మహేశ్, కనకం బాబు, ప్రభుదాస్, నాగేశ్వర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.