Ram Charan: 18 ఏళ్లలో 2 ఇండస్ట్రీ హిట్స్.. పెద్దితో రామ్ చరణ్ ఖాతాలో మరో ఇండస్ట్రీ హిట్!

Ram Charan: 18 ఏళ్లలో 2 ఇండస్ట్రీ హిట్స్.. పెద్దితో రామ్ చరణ్ ఖాతాలో మరో ఇండస్ట్రీ హిట్!

ఇండియన్ సినిమాల్లో మోస్ట్ అవైటెడ్ టాలీవుడ్ మూవీ ‘పెద్ది’ (PEDDI). హీరో రామ్ చరణ్ నటిస్తున్న ఈ రూరల్ పీరియాడిక్ డ్రామాపై భారీ అంచనాలున్నాయి. ప్రస్తుతం పెద్ది శరవేగంగా షూటింగ్ జరుపుకుంటుంది. ఈ క్రమంలోనే లేటెస్ట్గా పెద్ది నుంచి ఓ ఇంట్రెస్టింగ్ పోస్టర్ రిలీజ్ చేశారు మేకర్స్. రామ్ చరణ్ సినీ ఎంట్రీ ఇచ్చి విజయవంతంగా 18 సంవత్సరాలు పూర్తి చేసుకున్నారని మేకర్స్ తెలిపారు. ఈ మేరకు పోస్టర్ రిలీజ్ చేసి చరణ్కు విషెస్ తెలిపారు. 

‘‘ గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ అలియాస్ పెద్ది..18 సంవత్సరాల సినీ జీవితాన్ని జరుపుకుంటున్నాము. మెగా తనయుడిగానే కాకుండా మీకంటూ ఓ స్పెషల్ సిగ్నేచర్ ఏర్పాటు చేసుకుని దూసుకెళ్తున్నారు. మీ నటనతో మాకు ఎన్నో అద్భుత క్షణాలను అందించారు. మీ ప్రయాణాన్ని పెద్ది సెట్లో జరుపుకోవడం హ్యాపీగా ఉంది. ఇది జస్ట్ ప్రారంభం మాత్రమే. పెద్ది నుండి మరిన్ని పెద్ద విషయాలు ఎదురుచూస్తున్నాయి. #18YearsOfRAMCHARANsGlory’’ అని ట్వీట్ చేశారు. రామ్ చరణ్ ఈ 18 ఏళ్లలో 16 సినిమాలు చేసి గ్లోబల్ స్టార్గా ఎదిగారు.

‘పెద్ది’ మూవీని దాదాపు రూ.200 కోట్ల బ‌డ్జెట్‌తో వృద్ధి సినిమాస్ బ్యాన‌ర్‌పై వెంక‌ట స‌తీష్ కిలారు ప్రొడ్యూస్ చేస్తున్నాడు. మైత్రీ మూవీ మేక‌ర్స్‌, సుకుమార్ రైటింగ్స్ ప్ర‌జెంట‌ర్స్‌గా వ్య‌వ‌హ‌రిస్తున్నాయి. రత్నవేలు సినిమాటోగ్రాఫర్గా చేస్తున్నారు. 27 మార్చి 2026న థియేటర్లలో విడుదల కానుంది.

రామ్ చరణ్ సినీ ప్రస్థానం:

2007లో చిరుత (Chirutha) మూవీతో సినీ అరంగేట్రం చేసిన రామ్ చరణ్ (Ram Charan).. గ్లోబల్ స్టార్గా ఎదిగే వరకు తన ప్రస్థానాన్ని చాటుకున్నారు. తండ్రీకి తగ్గ తనయుడిగా ఇండస్ట్రీ నుంచి ప్రశంసలు అందుకున్నారు. తన నటనలోనూ, డాన్స్ లోను తనదైన ముద్ర వేసుకుని..స్టార్ డైరెక్టర్స్ అందరికీ మోస్ట్ వాంటెడ్ యాక్టర్ అయ్యాడు.

తన కెరీర్ ఫస్ట్ మూవీ చిరుత (2007) డైరెక్టర్ పూరీ రాసిన డైలాగ్స్తో మెగా ఫ్యాన్స్కు గుండెల్లో స్థానం పొందాడు. ఈ మూవీ విజయవంతం అవ్వడంతో పాటు తనకు ఆ సంవత్సరానికి ఉత్తమ నూతన నటుడిగా ఫిలింఫేర్ అవార్డు మరియూ నందీ స్పెషల్ జ్యూరీ అందుకున్నారు.

ఈ క్రమంలో మగధీర, రంగస్థలం సినిమాలతో రెండు ఇండస్ట్రీ హిట్స్ అందించి మెగా పవర్ స్టార్గా ఎదిగారు. అయితే, జక్కన్న తెరకెక్కించిన RRRతో గ్లోబల్ స్టార్గా మారి, బుచ్చిబాబుతో పెద్ది, సుకుమార్తో RC17 చేస్తున్నారు. ఇపుడు ఈ కొత్త సినిమాలతో మరో కొత్త మార్క్ చూపించనున్నారు చరణ్