పెద్ద బుద్ధుడు మళ్లీ దర్శనమిచ్చిండు

పెద్ద బుద్ధుడు మళ్లీ దర్శనమిచ్చిండు

ప్రపంచంలోనే పెద్ద బుద్ధుడు. చైనాలోని సిచువాన్ ప్రావిన్స్ లోని లెషాన్ అనే నగరంలో ఉన్నాడు. ఆరు నెలలపాటు ఆయన దర్శనం దొరకలేదు. కారణం, రిపేర్లు చేయడానికి కొండలో చెక్కిన ఆ పెద్ద రాతి విగ్రహాన్నిచైనా ఆర్కియాలజిస్టులు పరిశీలించారు. ఎక్కడెక్కడ ఎలా ఉందో పరీక్షించారు. దీంతో ఎవరినీఇన్నాళ్లపాటు అక్కడకు రానివ్వలేదు. గత ఏడాది అక్టోబర్ నుంచి విగ్రహ పరిశీలనను చేపట్టారు అధికారులు. డ్రోన్ ఏరియల్ సర్వే, త్రీడీ లేజర్ స్కానింగ్ తదితర అధునాతన పద్ధతులను వాడి దానికి పరీక్షలు చేశారు. తాజాగా శుక్రవారం దానిని సందర్శకుల కోసం తిరిగి ఓపెన్ చేశారు. ఓ పెద్ద కొండలోనే 71మీటర్లు ఎత్తున విగ్రహాన్ని చెక్కారు. 713వ సంవత్సరంలో టాంగ్ డైనాస్టీ రాజులు ఆ బుద్ధుడిని కొలువుదీర్చారని చరిత్ర చెబుతోంది. 2001లో రాతి బుద్ధుడిని క్లీన్ చేసేందుకు ప్రాజెక్ట్​ చేపట్టారు. సిమెంట్ నిర్మాణాలు, డ్రైనేజీ పైపులు, నెర్రెల రిపేర్ వంటివి చేప్టటారు. 2007లోనూ రిపేర్లు చేశారు.