లోకేష్ కు పార్టీ పగ్గాలు ఇవ్వాలి..బుద్ధా వెంకన్న డిమాండ్..

లోకేష్ కు పార్టీ పగ్గాలు ఇవ్వాలి..బుద్ధా వెంకన్న డిమాండ్..

ఏపీలో ఎన్నికల హడావిడి ముగిసింది.ఫలితాల కోసం అంతా ఉత్కంఠగా ఎదురుచూస్తున్నారు. ఈ క్రమంలో అధికార, ప్రతిపక్షాలు ఎవరి లెక్కలు వారు వేస్తూ, గెలుపుపై ధీమా వ్యక్తం చేస్తున్నారు. ఇదిలా ఉండగా టీడీపీ నేత బుద్ధా వెంకన్న చేసిన వ్యాఖ్యలు పార్టీలో చర్చనీయాంశం అయ్యాయి. ఈ ఎన్నికల్లో కూటమి గెలుపు ఖాయమని, పార్టీ కోసం చంద్రబాబుతో సహా భువనేశ్వరి, లోకేష్, బ్రాహ్మణీలు కూడా కష్టపడ్డారని అన్నారు.లోకేష్ కు పార్టీ బాధ్యతలు అప్పగించాలని, ఇది రిక్వెస్ట్ కాదు డిమాండ్ అని అన్నారు.

ALSO READ | బ్లడ్ శాంపిల్స్ ఇచ్చేందుకు సిద్ధమా.. సోమిరెడ్డికి కాకాని సవాల్..

2019 ఎన్నికల్లో పార్టీ 23స్థానాలకే పరిమితమైన నేపథ్యంలో పదవులు అనుభవించిన నాయకులు కూడా టీడీపీ పని అయిపోయిందని పార్టీ గురించి వెటకారంగా మాట్లాడారని అన్నారు. గతంలో చంద్రబాబు ఒంటిచేత్తో పార్టీని నడిపేవారని కానీ, ఇప్పుడు ఆయనకు తోడుగా భువనేశ్వరి, లోకేష్, బ్రాహ్మణి కూడా తోడయ్యారని అన్నారు. లోకేష్ కు పార్టీ బాధ్యతలు అప్పగిస్తే మరో 30ఏళ్ళు వెనక్కి తిరిగి చూసుకునే పరిస్థితి ఉండదని అన్నారు బుద్ధా వెంకన్న. ఇప్పటిదాకా పార్టీ అధ్యక్షుడిగా పని చేసిన అచ్చెన్నాయుడు బాగా పని చేశారని, కూటమి ప్రభుత్వం ఏర్పడ్డాక ఆయనకు ప్రమోషన్ ఇచ్చి కీలక మంత్రి పదవి ఇవ్వాలని అన్నారు.