బడ్జెట్​లో ఇన్​ఫ్రాకు బూస్ట్.. క్యాపెక్స్​ కోసం రూ. 10.2 లక్షల కోట్లు?

బడ్జెట్​లో ఇన్​ఫ్రాకు బూస్ట్.. క్యాపెక్స్​ కోసం రూ. 10.2 లక్షల కోట్లు?
  • ప్రైవేటు పెట్టుబడులను పెంచడమే టార్గెట్​

న్యూఢిల్లీ: ప్రైవేట్ పెట్టుబడులను పెంచడానికి, ఆర్థిక వృద్ధిని ప్రోత్సహించడానికి రాబోయే బడ్జెట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో మౌలిక సదుపాయాల రంగానికి ప్రభుత్వం మూలధన వ్యయాన్ని (క్యాపెక్స్​) పెంచవచ్చని ఎక్స్​పర్టులు చెబుతున్నారు. కరోనా తర్వాత కేంద్రం బడ్జెట్​లో క్యాపెక్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కు ప్రత్యేక ప్రాధాన్యతను ఇస్తోంది.  ఫలితంగా భారతదేశం గత మూడేళ్లలో 7 శాతానికి పైగా వృద్ధిని సాధించింది. ఇది ప్రపంచంలోని పెద్ద ఆర్థిక వ్యవస్థలలో అత్యధికం! ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో క్యాపెక్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కు ప్రభుత్వం అత్యధికంగా రూ.10 లక్షల కోట్లు కేటాయించింది. 2020–-21లో ప్రభుత్వం రూ. 4.39 లక్షల కోట్లను కేటాయించగా, ఆ తర్వాతి సంవత్సరంలో ఇది 35 శాతం పెరిగి రూ. 5.54 లక్షల కోట్లకు చేరుకుంది. 2022–-23లో క్యాపెక్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో మరో 35 శాతం ఎగిసి రూ. 7.5 లక్షల కోట్లకు చేరుకుంది. ఇది గత ఏడాది 37.4 శాతం వృద్ధితో రూ. 10 లక్షల కోట్లకు చేరుకుంది. రాబోయే బడ్జెట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో కూడా ఇటువంటి పెట్టుబడి ఆర్థిక వ్యవస్థపై సానుకూల ప్రభావాన్ని చూపుతుంది.  ఇది ప్రైవేట్ పెట్టుబడులను కూడా పెంచుతుంది కాబట్టి ప్రభుత్వం క్యాపెక్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కు పెద్ద మొత్తంలో నిధులు కేటాయించవచ్చని భావిస్తున్నారు. "2025 ఆర్థిక సంవత్సరంలో భారత ప్రభుత్వం క్యాపెక్స్​కు రూ. 10.2 లక్షల కోట్ల వరకు కేటాయిస్తుందని మేం అంచనా వేస్తున్నాం. కరోనా తర్వాత సంవత్సరాలలో క్యాపెక్స్​ను 20 శాతానికి పైగా పెంచింది. క్యాపెక్స్​ను తగ్గిస్తే వృద్ధి, ఆర్థిక కార్యకలాపాలు,  జీడీపీ వృద్ధిపై కొంత ప్రభావం చూపే అవకాశం ఉంది" అని ఇక్రా తన ముందస్తు- బడ్జెట్ అంచనాలలో పేర్కొంది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (బడ్జెట్​ అంచనాల్లో 58.5 శాతం) ఏప్రిల్–-నవంబర్ మధ్య క్యాపెక్స్​ 31 శాతం పెరిగి రూ.5.9 లక్షల కోట్లకు చేరుకుంది.

వృద్ధి ఎక్కువగానే ఉన్నప్పటికీ, మూలధన వ్యయం అక్టోబర్ 2023లో తగ్గింది. గత నవంబరులో స్వల్పంగా 1.6 శాతం పెరిగింది. అంతేకాకుండా, ఇది సగటున నెలకు రూ.73,210 కోట్లుగా ఉంది.  బడ్జెట్ లక్ష్యం రూ. 10 లక్షల కోట్లను చేరుకోవడానికి అవసరమైన నెలవారీ సగటు రూ. 83,400 కోట్ల కంటే ఇది 12.2 శాతం తక్కువ. ఆర్థిక వ్యవస్థలో వృద్ధితో, ఉక్కు, సిమెంట్  పెట్రోలియం రంగం వంటి కొన్ని రంగాలలో ఇటీవలి కాలంలో ప్రైవేట్ పెట్టుబడులు పుంజుకున్నాయి. ఈ విషయమై ఎంకే గ్లోబల్ ఫైనాన్షియల్ సర్వీసెస్ హెడ్ (రీసెర్చ్) శేషాద్రి సేన్ మాట్లాడుతూ ప్రభుత్వం క్యాపెక్స్ ప్రాధాన్యాన్ని కొనసాగిస్తుందని స్పష్టం చేశారు.   పెట్టుబడులు పెరగడం వల్ల ఉద్యోగాలు, డిమాండ్, ఎగుమతులు​ పెరుగుతాయని అన్నారు.